»   » విలాసవంతమైన విందులో ఐశ్వర్య!

విలాసవంతమైన విందులో ఐశ్వర్య!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  aishwarya rai
  ప్రపంచ సుందరిగా అందరికీ సుపరిచితమైన అందాలరాశి రోబో సినిమాతో మరింత కీర్తిని సంపాదించింది. పెళ్ళైనా ఏమాత్రం చెక్కుచెదరని అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. ఆ అందాల అపరంజి బొమ్మే ఐశ్వర్య. ఈరోజు ఆమె పుట్టినరోజు. నేటితో 37 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఐశ్వర్యకు జన్మదిన శుభాకాంక్షలు . ఆమె అందం అపురూపం అందులో సందేహమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిన బాలీవుడ్ బ్యూటీ ఈమె. ఫిల్మ్ మేకర్స్ మొదలు టీనేజ్ బాయ్స్ వరకూ ఆమెను ఆరాధించే వారే. 1994 లో మిస్ వరల్డ్ టైటిల్ పొందినది మొదలు ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళలను ఎంతగానో ప్రభావితం చేసారు. సాంప్రదాయ సుడిగుండంలో చిక్కుకోకుండా ఐష్ తన ప్రతిభకు మెరుగులు పెడుతూనే ఉన్నారు. వివాహానంతరం కూడా ఆమె తన కెరీర్ గ్రాఫ్ నూ పెంచుకుంటూనే వచ్చారు.

  ఈ సాయంత్రం ముంబైలో విలాసవంతమైన విందును బచ్చన్ కుటుంబ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఈ విందులో బాలీవుడ్ ప్రముఖ తారలు, ముంబై ప్రముఖుల పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదే నెలలో ఐశ్వర్య ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటం గమనార్హం.

  English summary
  Today is Aishwarya Rai’s Birthday. We wish her a happy thirty-eighth birthday. Mum-to-be, actress Aishwraya Rai Bachchan is turning a year older today and is glowing with happiness with all the pampering she has been treated to in the past few months. Mid-November is the due-date for Ash and Abhishek’s little one, and all of Bollywood is waiting for the big day.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more