»   » ఐశ్వర్యరాయ్ అందానికి మరోసారి ప్రపంచ ఖ్యాతి!

ఐశ్వర్యరాయ్ అందానికి మరోసారి ప్రపంచ ఖ్యాతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అందాల సుందరి ఐశ్వర్యరాయ్‌కి మరోసారి ప్రపంచ ఖ్యాతి లభించింది. వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్స్ లిస్టులో 4వ స్థానం సొంతం చేసుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ 'హాలీవుడ్ బజ్' నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో టాప్-30లో ఐశ్వర్యరాయ్ 4వ స్థానం దక్కించుకుంది.

టాప్ -30 లిస్టులో ఇటాలియన్ నటి మోనికా బెల్లుసి, అమెరికన్ మోడల్ మరియు నటి కేట్ అపాన్, హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ తొలి మూడు స్థానాలు దక్కించుకోగా....ఐశ్వర్యరాయ్‌కి 4వ స్థానం దక్కింది. మోస్ట్ ఇంటెలిజెంట్, డిజైరబుల్, సక్సెస్ ఫుల్ ఉమెన్ అనే అంశాలపై ఈ పోల్ నిర్వహించారు. దాదాపు 4 మిలియన్ల మంది ఈ ఓటింగులో పాల్గొన్నారు.

ఇటీవలే 40వ వసంతంలోకి అడుగు పెట్టిన ఐశ్వర్యరాయ్, తనకు ఇలాంటి అంతర్జాతీయ గౌరవం దక్కేలా చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ' ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ల మంది పాల్గొన్న ఈ ఓటింగులో నాకు 4వ స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉంది' అని ఐశ్వర్యరాయ్ పేర్కొన్నారు.

సినిమాల విషయానికొస్తే...ఐశ్వర్యరాయ్, టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, నాగార్జున కలిసి నటించబోతున్నారు. ఈ భారీ కాంబినేషన్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా ఎంపికయినట్లు సమాచారం.

English summary
Bollywood actress Aishwarya Rai Bachchan has been voted the world's fourth most beautiful woman in a recent poll conducted by online magazine 'Hollywood Buzz'. Rai ranked fourth on the list of 'Top 30' Most Beautiful Women after Italian actress Monica Belluci, American model-actress Kate Upton and Hollywood star Angelina Jolie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu