»   » పవన్ కానీ మహేష్ అనుకుంటే అజయ్ వచ్చాడేంటి?

పవన్ కానీ మహేష్ అనుకుంటే అజయ్ వచ్చాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రచార కర్తలుగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. నిన్నటి రోజు మధ్యాహ్నం విజయవాడలోని సీఎం కార్యాలయంలో అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రచారకర్తలుగా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరి ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ ని గానీ మహేష్ ని కాని మరో తెలుగు హీరోని కాని... ఎపి టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారని భావించారు. ముఖ్యంగా చంద్రబాబుకు, పవన్ కు ఉన్న అనుబంధంతో ఇది సాధ్యం అవుతుందని భావించారు. అయితే ఊహించని విధంగా అజయ్ దేవగన్ సీన్ లోకి వచ్చి షాక్ ఇచ్చారు.

Ajay Devgan Offers to Become Brand Ambassador for AP Tourism

ఆంధ్రప్రదేశ్‌లో వినోదం, మీడియా, క్రియేటివ్‌ సిటీ ప్రాజెక్టు చేపట్టేందుకు అజయ్‌దేవగణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు..అజయ్‌దేవగణ్‌తో అన్నారు.

సీఎంతో భేటీ అనంతరం అజయ్‌గేవగణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు పనితీరు నాకు చాలా ఇష్టం. అందుకే కలిసేందుకు వచ్చా. గత 25ఏళ్లుగా హైదరాబాద్‌ను చూస్తున్నా. చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన నిబద్ధతను చూస్తే.. విజయవాడ సహా ఈ ప్రాంతమంతా కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది.

English summary
Popular bollywood couple - Ajay Devgan and Kajol - have volunteered to become brand ambassadors for Andhra Pradesh Tourism and had offered to invest in entertainment, media and creative city projects.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu