»   » షూటింగులో తీవ్ర గాయాలపాలైన అజిత్

షూటింగులో తీవ్ర గాయాలపాలైన అజిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తమిళ న‌టుడు అజిత్‌ మరోసారి సినిమా షూటింగులో గాయాలపాలయ్యాడు. తన సినిమాల్లో యాక్షన్ సీన్లు డూప్ లేకుండా తనే స్వయంగా చేసే అజిత్.... శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న 'వివేగం' షూటింగులో గాయపడ్డారు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అజిత్ ఎత్తు నుండి కింద పడిపోయాడు. దీంతో ఆయన భుజానికి గాయాల‌య్యాయి.

పరిస్థితి ఎలా ఉంది?

పరిస్థితి ఎలా ఉంది?

అజిత్ ప్ర‌స్తుతం యూరఫ్ లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ గాయం కారణంగా రెండు రోజులుగా షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

వివేగమ్

వివేగమ్

అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న 'వివేగమ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈచిత్రంలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్‌ అధికారిగా నటిస్తున్నాడు.

హాలీవుడ్ రేంజిలో

ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో వాడిన టెక్నాలజీ హాలీవుడ్ రేంజిలో ఉందని స్పష్టమవుతోంది.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అజిత్- శివ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన వేదాలం, వీరమ్ చిత్రాలు తమిళనాడులో భారీగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'వివేగమ్' పై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.

English summary
Did you know that Ajith Kumar injured his shoulder recently? Yes, while filming an action scene for his upcoming film Vivegam in Europe, he allegedly got his shoulder injured. The team did not publicize it since it would create panic among his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu