For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thunivu-Varisu: ఒకరోజు ముందుగా అజిత్ 'తెగింపు'.. 'వారసుడు' కోసం దిల్ రాజు ప్లాన్ మారుస్తాడా?

  |

  కొత్త ఏడాది వచ్చిందంటేనే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక సినిమాలు సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలోకి బడా హీరోలే దిగుతారు. మకర సంక్రాంతి వేళ స్టార్ హీరోల మధ్య సినిమాల పోటీ కోడిపందాలను తలపించేలా ఉంటుందని పలువురి మాట.

  ఇప్పటికే ఈ సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవితోపాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో బడా హీరో వచ్చి చేరాడు. అతనే తలా అజిత్. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్న అజిత్ సైతం సంక్రాంతికి సందడి చేయనున్నాడు.

  దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు..

  దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు..

  ఈసారి సంక్రాంతి పండుగ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోలంతా సంక్రాంతి ఫైట్ లో పోటీ పడనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య బాబు సంక్రాంతి బరిలో నిలవగా వారి సరసన కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ వచ్చి చేరాడు.

  విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న వారిసు (వారసుడు) చిత్రాన్ని టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్ల విషయంలో ఇటీవల చిన్నిపాటి కాంట్రవర్సీ కూడా నెలకొంది.

  దిల్ రాజు కామెంట్స్ వైరల్..

  దిల్ రాజు కామెంట్స్ వైరల్..

  ఇళయదళపతి నేరుగా చేస్తున్న తొలి సినిమా, అలాగే బైలింగువల్ మూవీ వారసుడును జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా విజయ్ ను పొగుడుతూ దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

  బోనీ కపూర్ నిర్మాతగా..

  బోనీ కపూర్ నిర్మాతగా..

  అయితే ఇప్పుడు వారసుడికి పోటీగా మరో కోలీవుడ్ హీరో అజిత్ వచ్చాడు. దీంతో ఈ సంక్రాంతి ఫైట్ బిగ్ టఫ్ గా మారనుంది. ఈ 2023 సంక్రాంతి బరిలోకి తెగింపు (తునివు)తో గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తున్నాడు తలా అజిత్. ఇటీవల అజిత్ నటించిన నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. అలాగే ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు.

  హ్యాట్రిక్ కొట్టేందుకు..

  హ్యాట్రిక్ కొట్టేందుకు..

  ఇప్పుడు వస్తున్న అజిత్ తెగింపు చిత్రానికి కూడా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంటే అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రం ఇది. ఈ సినిమాలో ఫీమెల్ లీడ్ గా మంజు వారియల్ నటించగా సముద్ర ఖని, వీర, జాన్ కొక్కెన్, అజయ్, సీబీ చంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  ఫ్రీ రన్ దొరికే అవకాశం..

  ఫ్రీ రన్ దొరికే అవకాశం..

  అయితే అజిత్ తెగింపు చిత్రం విజయ్ వారసుడు చిత్రానికి పోటీగా అదే రోజున విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆ చిత్రానికి ఒకరోజు ముందుగా తెగింపుని రిలీజ్ చేస్తున్నట్లుగా జీ స్టూడియో ప్రకటించింది. వారిసు కంటే ముందుగా తునివు ఒకరోజు విడుదలైతే తమిళనాట ఫ్రీరన్ దొరుకుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో వారిసు కూడా జనవరి 11వ తేది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

  అంతగా లేని మార్కెట్..

  ఒకవేళ జనవరి 11న వారిసు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తే విజయ్ కి కలిసి వచ్చే అంశమే. ఎందుకంటే తెలుగులో జనవరి 12న బాలకృష్ణ వీర సింహా రెడ్డి విడుదల కావడంతో ఒకరోజు ఫ్రీ రన్ దొరుకుతుంది. తెలుగులో అజిత్ కు మార్కెట్ అంతంత మాత్రమే. కాబట్టి దిల్ రాజు కూడా వారసుడు చిత్రాన్ని ఒకరోజు ముందుకు జరిపే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఇలా ఎవరి ప్లాన్స్ వారికి ఉండటంతో అవే తేదిల్లో విడుదల చేస్తారా.. లేదా మారుస్తారా అనేది వేచి చూడాలి.

  English summary
  Ajith Thunivu Release Date Announced By Zee Studio A Day Ahead Of Vijay Varisu And Dil Raju Can Change The Release Date Of Vijay Varisu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X