»   » అజిత్ కి రహస్యంగా సర్జరీ: ఆపరేషన్ విజయవంతం, ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు

అజిత్ కి రహస్యంగా సర్జరీ: ఆపరేషన్ విజయవంతం, ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
అజిత్ కి రహస్యంగా సర్జరీ Actor Ajith Underwent A Secret Surgery

ఆమధ్య బల్గేరియాలో 'వివేకం' సినిమా షూటింగ్ జరిగిన సమయంలో గాయపడ్డ అజిత్ కు, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అజిత్ వివేగం షూటింగ్‌లో ఉన్నప్పుడు డూప్ లేకుండా నటించాడు. ఆ సమయంలో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం అజిత్ భారీ కసరత్తులు చేసి బాడీని పెంచాడు. తన బాడీని సిక్స్ ప్యాక్‌కు మలుచుకున్నాడు. వివేగంలో దాదాపుగా గంటన్నరపాటు యాక్షన్ సన్నివేశాలున్న సంగతి తెలిసిందే.

వివేగం సినిమా కోసం బల్గేరియాలో ఫైటింగ్ సన్నివేశాల సందర్భంగా అజిత్ భుజానికి బలమైన గాయం అయ్యింది. ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే మళ్ళీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే ఆ సమయం లోనే నెలరోజులకు పైబడి విశ్రాంతి తీసుకోవాలని అజిత్ కు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

Ajith Undergoes A Shoulder Surgery

వివేగం షూటింగ్ పూర్తైన తర్వాత అజిత్ తన ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నాడు. దానికి సంబంధించిన ఆపరేషన్ ను ఈ నెల 7న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల పాటు అజిత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని వారు సూచించారు. అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ విషయం బయటకి తెలియనివ్వలేదు. అభిమానుల తాకిడి ఉంటుందన్న భయం తో ఆసుపత్రి నుంచి బయటికి వచ్చే వరకూ ఆ వివరాలేవీ బయట పెట్టలేదు...

షూటింగుల్లో గాయపడటం అజిత్ కు కొత్తేమీ కాదు, గతంలో పలుసార్లు గాయపడ్డాడు. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. 'వివేకం' కథ చెప్పడానికి అజిత్ వద్దకు ఆ చిత్ర దర్శకుడు శివ వెళ్లినప్పుడు..అజిత్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఉన్నాడట. దీంతో, 'వివేకం' చిత్రంలో అజిత్ ఎలా నటిస్తారనే ఆలోచనలో శివ పడ్డాడు. అయితే, పూర్తిగా కోలుకుని మరింత ఫిట్ గా అజిత్ తయారై ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.

English summary
Actor Ajith, fondly called as Thala, underwent a surgery on his shoulder recently in Chennai and is advised to rest for 45 days to recuperate from the surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu