Don't Miss!
- Sports
IND vs ENG: టీమిండియా దరిద్రమో.. ఇంగ్లండ్ అదృష్టమో! 32 ఏళ్ల తర్వాత ఓపెనర్లు వంద కొట్టారు!
- News
హైదరాబాద్లో కుండపోత వర్షం: నగరవాసికి తప్పని తిప్పలు, జీహెచ్ఎంసీ అలర్ట్
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
ఛార్మీతో అఫైర్.. పూరి జగన్నాథ్ విడాకులపై స్పందించిన ఆకాష్ పూరీ.. అందుకే అంటూ!
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు అంటే కాస్త సినిమాల విషయంలో వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. అయితే గత కొంత కాలంగా ఆయన హీరోయిన్ ఛార్మితో కాస్త సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో వారిద్దరి విషయంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలోనే పూరీ భార్య లావణ్య కూడా విడాకులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం మీద పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

చోర్ బజార్
పూరి జగన్నాథ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆకాష్ పూరి హీరోగా నిలదొక్కుకోవడానికి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు రకాల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ పూరి దేనితోనూ సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు.
చివరిగా రొమాంటిక్ అనే సినిమాతో తండ్రి మార్కుతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ ఇప్పుడు దళం, జార్జి రెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు జీవన్ దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమా చేశాడు.

ప్రమోషన్స్ లో
గెహనా సిప్పీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆకాష్ పూరి వరుస సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.. అలా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలోనే ఆకాష్ పూరి ఆయన తల్లిదండ్రులు విడాకుల వ్యవహారం మీద ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా అయితే దాన్ని దాట వేసేందుకు ప్రయత్నిస్తారు ఏమో కానీ ఆకాష్ పూరి మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ముందుకు వచ్చాడు.

హ్యాపీగా హాస్టల్ లో
అసలు తన తల్లిదండ్రుల విడాకులకు సంబంధించిన వార్తలు తాను వినను కూడా వినలేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. నిజానికి తాను చిన్న పిల్లవాడిగా ఉన్న సమయంలో డాడీ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాము అని ఆ విషయం కూడా మాకు తెలియకుండా అమ్మ మమ్మల్ని హాస్టల్ లో చేర్పించి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుందని చెప్పుకొచ్చారు. మా నాన్న ఒక టాప్ డైరెక్టర్, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటూ నేను, చెల్లి హ్యాపీగా హాస్టల్ లో ఉన్నామని ఆ తర్వాత కొంత ఊహ తెలిశాక మాకు విషయాలు అర్థం అయ్యాయి అని చెప్పుకొచ్చారు.

అతిపెద్ద సపోర్ట్ సిస్టం
మా నాన్న మళ్ళీ కోలుకున్నాడు అంటే దానికి కారణం మా అమ్మే అని, నాన్నకి అతిపెద్ద సపోర్ట్ సిస్టం ఆమేనని చెప్పుకొచ్చాడు. అసలు ఈ విడాకుల ప్రచారం వార్తల కోసం ఎవరో రాసి వదిలేదే తప్ప తప్ప మా అమ్మానాన్న చాలా హ్యాపీగా ఉన్నారని ఎలాంటి ఇబ్బందులు లేవని ఆకాష్ చెప్పుకొచ్చాడు.


ఎలా విడాకులు ఇస్తుంది?
మా అమ్మ నాన్న వివాహం జరిగిన సమయంలో మా నాన్న కేవలం రెండు వందల రూపాయలు నా జేబులో ఉన్నాయి నన్ను నమ్మి రాగలవా అని అడిగితే మా అమ్మ నమ్మి వెళ్లారని అలాంటి ఆమె ఇప్పుడు విడాకులు ఇస్తారు అని వార్తలు రావడంతో ఏ మాత్రం కరెక్ట్ గా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తన తండ్రి విషయంలో తను చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లడం చాలా ఆనందం కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా ఆకాశ్ చెప్పుకొచ్చాడు.