»   » అమీర్ ఖాన్ డేరింగ్ స్టెప్: ‘దంగల్’ స్టోరీ మొత్తం ఓపెన్..

అమీర్ ఖాన్ డేరింగ్ స్టెప్: ‘దంగల్’ స్టోరీ మొత్తం ఓపెన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సినీ ప్రేక్షకులు, బాలీవుడ్ సినిమాలను ఇష్టపడే అభిమానులు, అమీర్ ఖాన్ ఫ్యాన్స్... అందరి దృష్టి ఇపుడు త్వరలో రాబోతున్న 'దంగల్' మూవీపైనే ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమా వస్తుందంటే సినిమాలో ఏం చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారంతా.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సినిమా స్టోరీ ముందుగా బయట పెట్టడం అంటే డేరింగ్ స్టెప్ కాక మరేమిటి?. దంగల్ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ దీనికి వారం ముందే.. ఈ మూవీకి ఆధారమైన మహావీర్ సింగ్ ఫొగట్ ఆత్మకథ పుస్తక రూపంలో విడుదల చేయబోతున్నారు.

అఖడా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ మహావీర్ సింగ్ ఫొగట్

అఖడా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ మహావీర్ సింగ్ ఫొగట్

మహావీర్ సింగ్ ఫొగట్ జీవితం ఆధారంగానే ‘దంగల్' మూవీ తెరకెక్కుతోంది. సినిమాలో అమీర్ ఖాన్ మహావీర్ సింగ్ పొగట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన జీవిత చిత్రను ‘అఖడా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ మహావీర్ సింగ్ ఫొగట్' అనే పుసక్త రూపంలో విడుదల చేస్తున్నారు. సౌరభ్ దగ్గల్ ఈ పుస్తకాన్ని రచించారు.

తెలుగులో కూడా

తెలుగులో కూడా

ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఇటీవల తెలుగు ట్రైలర్, పోస్టర్ రిలీజ్ చేసారు. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

rn

పికె తర్వాత

పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేశాడు.

నితేశ్ తివారి

నితేశ్ తివారి

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దంగల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ ని విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ట్రైలర్ కు కూడా రెస్పాన్స్ బావుంది.

rn

ఈ పాట అదిరింది

సినిమాలో హానీకారక్ బాపు అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. సర్వార్ ఖాన్ మరియు సర్తాజ్ ఖాన్ పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ప్రీతమ్ అందించిన సంగీతంకు మంచి అప్లాజ్ వస్తోంది. తాజాగా విడుదలైన తొలి సాంగ్ లో తన కూతుళ్ళను రెజ్లర్ గా తయారు చేసేందుకు తండ్రి వారిపై ఎంతటి శ్రద్ద వహించాడో ఈ సాంగ్ లో చూపించారు.

అమీర్ ఖాన్, మహవీర్‌సింగ్‌ పొగట్‌

అమీర్ ఖాన్, మహవీర్‌సింగ్‌ పొగట్‌

'దంగల్' మూవీ 'అమీర్' చేసిన '3 ఇడియట్స్', 'పీకే' కన్నా గొప్ప ఉంటుందని బాలీవుడ్ సెలెబ్రిటీస్ అంటున్నారు. మామూలుగానే 'అమీర్' సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో 'దంగల్' పై అంచనాలు మరింత పెరిగాయి. డిసెంబరు 23న 'దంగల్' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

English summary
A book on the journey of Mahavir Singh Phogat will hit bookstands next month, days before the release of 'Dangal' in which Aamir Khan portrays the amateur wrestler and master coach on screen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu