»   » రానా, అఖిల్ మధ్యలో శ్రియా భూపాల్: సోషల్ మీడియాలో వైరల్ ఫొటో

రానా, అఖిల్ మధ్యలో శ్రియా భూపాల్: సోషల్ మీడియాలో వైరల్ ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో కాస్త గంభీరంగా క‌నిపిస్తాడు కానీ రియ‌ల్ లైఫ్ లో మాత్రం చాలా జోవియల్ గా ఉంటాడు. చివ‌ర‌కు సెట్స్ లోనూ, స్టేజ్ మీద కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. టాలీవుడ్ లో కుర్రాళ్ల హంగామా ఎక్కడుంటే.. అక్కడ రానా దగ్గుబాటి ప్రత్యక్షమైపోతూ ఉంటాడు. ఇదే మాట ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. రానా ఎక్కడుంటే అక్కడుంటే అక్కడ యూత్ హంగామా పీక్స్ లో ఉంటుందన్న మాట. ప్రస్తుతం టాలీవుడ్ లో అఖిల్ వీక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్-శ్రేయా భూపాల్ ల నిశ్చితార్ధం దగ్గర నుంచి.. రకరకాల గ్రూప్ లతో పార్టీలు హంగామా చేసేస్తున్నారు.

Akhil Akkineni and Bahubali Rana ,Shriya bhupal Unseen personal photo

ఇందులో భాగంగా నిశ్చితార్ధపు జంట అక్కినేని అఖిల్-శ్రేయా భూపాల్ లతో పాటు రానా కలిసి ఇచ్చిన ఓ పిక్ తెగ వైరల్ అయిపోతోంది. గోడమీద కూర్చున్న అఖిల్ ని కాబోయే భార్య హగ్ చేసుకుంటే.. ఆజానుబాహుడు రానా ఇద్దరినీ కలిపి పట్టుకున్నాడు. ఈ ఫోటోలో స్పెషాలిటీ ఏంటంటే.. అక్కినేని అఖిల్- దగ్గుబాటి రానాలు బావ బామ్మరిది అవుతారనే సంగతి తెలిసిందే.

అయితే గతం లో ఒక సారి పెళ్ళి విషయం లో అఖిల్ ని ఆట పట్తిచాడు రానా. అఖిల్ ప్రేమ.. పెళ్లి న్యూస్ వార్త‌ల్లోకి వ‌స్తేగానీ.. వ‌య‌సు సంగ‌తి రానాకు గుర్తుకు రాలేదు. దీంతో కాస్త మొహ‌మాట‌ప‌డ్డాడు. సింగ‌పూర్‌లో ఆమ‌ధ్య జ‌రిగిన సైమా అవార్డ్స్‌లో .. బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్ అవార్డ్ ను అఖిల్‌కు రానా ప్ర‌జెంట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా.. రానా అఖిల్‌ను నీ వ‌య‌సెంత అని అడిగాడు. సిగ్గుప‌డుతూ.. న‌వ్వుతూ.. 22 అనే సరికి.. నాకు 32 ఏళ్లు.. ఇంత‌వ‌ర‌కు పెళ్లి గురించి ఆలోచించ‌లేదు., నీకెందుకు అంత తొందర? అని రానా అనేస‌రికి అంద‌రూ ఒక్క‌సారిగా ఘొల్లుమ‌ని న‌వ్వేశారు.

English summary
A rare photo of Daggubati rana with Hero akkineni akhil and his wouldbe Sriya bhuopal is gone viral in social meadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu