»   » పాపం...! అఖిల్ ఫస్ట్ లుక్ లీకయ్యింది: పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది

పాపం...! అఖిల్ ఫస్ట్ లుక్ లీకయ్యింది: పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని అఖిల్.. హీరోగా అఖిల్ తోనే ఫెయిలయ్యాడు అయితే ఈ సారి మళ్ళీ కొత్త స్టైల్ లో ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు.అఖిల్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ ఫొటో ఒకటి ఇప్పుడు అక్కినేని అభిమానులను అలరిస్తోంది. ఇది లీక్ చేసిందా లేక లీకైందా అనే విషయం మాతం ఎవ్వరినీ అడగవద్దు.. ఎందుకంటే ఎవ్వరికీ తెలియదనే అంతా అనుకుంటున్నారు మరి...

ఫస్ట్‌ లుక్‌ లీక్ ని ఆపలేకపోయారు

ఫస్ట్‌ లుక్‌ లీక్ ని ఆపలేకపోయారు

చిత్ర యూనిట్‌ చాలా జాగ్రత్తగానే ఉందట కానీ లీకువీరులు అంతకంటే బలంగా ఉన్నారు, దాంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫస్ట్‌ లుక్‌ లీక్ ని ఆపలేకపోయారు. దీంతో సినిమా యూనిట్, అక్కినేని కాంపౌండ్ షాక్ కి గురైనా.. లీక్ అయితే నష్టమేముందిలే అని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేపు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని నాగ్ తెలిపారు.

ఓ స్టిల్‌ని రిలీజ్ చేశారు

ఓ స్టిల్‌ని రిలీజ్ చేశారు

21న బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. దానికి సంబంధించిన క్లూ ఇస్తారట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున సోషల్‌ మీడియాలో వెల్లడించారు. చిత్ర హీరో అఖిల్ కూడా ఫస్ట్ లుక్ లీకవడంతో షాకైనా.. ఫస్ట్ లుక్ ఫుల్ క్లారిటీ అంటూ ఓ స్టిల్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ స్టిల్ అయితే వెరైటీగానే ఉంది.

రంగుల రాట్నం

రంగుల రాట్నం

మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ అయిందనే వార్త వినిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొన్నటి వరకూ జున్ను అనే టైటిల్ ప్రచారంలో ఉండగా... తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా కోసం ‘రంగుల రాట్నం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టాక్.

డిసెంబర్ 22 న రిలీజ్

డిసెంబర్ 22 న రిలీజ్

ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఈ టైటిల్ నే ఖరారు చేస్తారా.. లేదా ఈ బ్యానర్లో మరో సినిమాకు ఈ టైటిల్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 22 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..

English summary
Ahead of the official launch on August 21st, First Look Poster of Akhil's untitled flick got leaked.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu