»   » అఖిల్ మూవీ టైటిల్ ప్రకటించిన రాజమౌళి, ఎన్టీఆర్, సూర్య, ప్రభాస్, చెర్రీ!

అఖిల్ మూవీ టైటిల్ ప్రకటించిన రాజమౌళి, ఎన్టీఆర్, సూర్య, ప్రభాస్, చెర్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని యువ హీరో అఖిల్ కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. రెండు మూడు రోజులుగా నాగార్జున, అఖిల్, నాగ చైతన్య, సమంత ఇలా అందరూ ఈ సినిమా టైటిల్ విషయమై కొన్ని క్లూస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం టైటిల్ ప్రకటించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నమైన రీతిలో టైటిల్ ప్రకటన చేశారు. ఎన్టీఆర్, కాజల్, ప్రభాస్, శృతి హాసన్, నాగ చైతన్య, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సమంత, సూర్య, నాని, వెంకటేష్, రాజమౌళి, రకుల్ ప్రీత్, రానా, నాగార్జున..... అంతా కలిసి 'హలో' చెబుతూ టైటిల్ ప్రకటించారు.

హలో

అఖిల్ అక్కినేని మూవీ టైటిల్ మరేదో కాదు... ‘హలో' అనేదే టైటిల్. చాలా వినూత్నంగా ఈ టైటిల్ ప్రకటించారు. ఈ టైటిల్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నట్లు అఖిల్ వెల్లడించారు.

అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ‘హలో'. దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

డిసెంబర్ 22న రిలీజ్

డిసెంబర్ 22న రిలీజ్

‘హలో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ. అన్న పూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టెన్మెంట్స్ సమర్పనలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నాగార్జున స్పెషల్ కేర్

నాగార్జున స్పెషల్ కేర్

అఖిల్ తొలి సినిమా ప్లాప్ కావడంతో ఈ సినిమా విషయంలో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నారు. ‘మనం' సినిమా దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు బావున్నాయి.

English summary
Akhil Akkineni's next movie title confirmed as "Hello". The movie is being directed by Vikram Kumar who prefers short one word titles - ‘13’, ‘Ishq’, ‘Manam’ and ‘24’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu