»   » అక్కినేని అఖిల్ బాధ పెట్టాడా? ఆమె ఎందుకు ఫీలైంది!

అక్కినేని అఖిల్ బాధ పెట్టాడా? ఆమె ఎందుకు ఫీలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. అఖిల్... హీరోయిన్ సాయేషా సైగల్ ను బాధ పెట్టాడని. మరి ఈ సీన్ ఏ సందర్భంలో వస్తుందో సినిమా విడుదలైతేగానీ చెప్పలేం. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన వీడియో క్లిప్ కూడా లీక్ అయింది. అందులో అఖిల్ డాన్స్ ఇరగదీసాడు.

Akhil Akkineni, Sayesha Saigal's movie location still

టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
This picture one can easily understand how much Sayesha Saigal has been upset with something mischief done by Akhil Akkineni. This still has been captured during the shoot of their launch pad in Telugu directed by VV Vinayak.
Please Wait while comments are loading...