»   » అఖిల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్: ‘హలో’ మూవీ సాంగ్ వైరల్ అయింది

అఖిల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్: ‘హలో’ మూవీ సాంగ్ వైరల్ అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్య జరిగిన సైమా వేడుకల్లో అఖిల్ ఓ పాటకు లైవ్ స్టేజ్ పెర్పార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోను సైమా అవార్డ్స్ అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే అఖిల్ అదరగొట్టాడు అని అనకుండా ఉండలేరు. ఈవీడియో ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఎంతో అద్భుతంగా ఈ పాటను కంపోజ్ చేశాడు. ఈ పాట హమ్ చేస్తూ అఖిల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో మైండ్ బ్లోయింగ్ అని, 'హలో' మూవీలో ఈ పాట సూపర్ హిట్ అవుతుందనే ప్రశంలు వెల్లువెత్తుతున్నాయి.

అఖిల్ పెర్ఫార్మెన్స్‌కు స్టాండింగ్ ఓవేషన్

‘సైమా' అవార్డుల వేడుకకు హాజరైన ప్రముఖులంతా అఖిల్ పెర్ఫార్మెన్స్‌కు ముగ్ధులైపోయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఒక్కసారి ఈ పాట చూస్తే మీరూ ముగ్దులైపోక తప్పదు.

హలో

హలో

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ‘హలో'. దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

డిసెంబర్ 22న రిలీజ్

డిసెంబర్ 22న రిలీజ్

‘హలో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ. అన్న పూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టెన్మెంట్స్ సమర్పనలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నాగార్జున

నాగార్జున

అఖిల్ తొలి సినిమా ప్లాప్ కావడంతో ఈ సినిమా విషయంలో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నారు. ‘మనం' సినిమా దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
Akhil Akkineni Song Performance From HELLO Movie At SIIMA 2017 video released. Akhil Akkineni's next movie title confirmed as "Hello". The movie is being directed by Vikram Kumar who prefers short one word titles - ‘13’, ‘Ishq’, ‘Manam’ and ‘24’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu