»   »  ఫ్యాన్స్ కోసం: అక్కినేని అఖిల్ ఇంకో వీడియో

ఫ్యాన్స్ కోసం: అక్కినేని అఖిల్ ఇంకో వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తొలి సినిమా కూడా రిలీజ్ కాకముందే స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ తెచ్చుకున్న అక్కినేని అఖిల్...సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటూంటారు. త్వరలో అఖిల్ ఓ చిన్న వీడియో తో పలకరించటాలని నిర్ణయించుకున్నాడుట. అయితే ఆ వీడియో ..తాజా సినిమాకు సంభందించిన మేకింగా లేక సెకండ్ టీజర్ మరేంటి అనేది తెలియ రాలేదు. ఈ విషయమై అఖిల్ ఇచ్చిన ట్వీట్ చూసి మీరు అంచనా వేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక అక్కినేని వంశం నుండి వస్తున్న మూడవ తరం యువ నటుడు అక్కినేని అఖిల్ తన తొలిచిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నానని చెప్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో చిత్ర యూనిట్ అంతా యూరప్, ఆఫ్రికా ప్రాంతాలలో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించే పనిలో వున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నామని చెప్తుననారు. ఈ చిత్ర యూనిట్ త్వరలో థాయ్ లాండ్ వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మరో యంగ్ హీరో నితిన్ నిర్మాణం చేపట్టడం విశేషం. సాయేషా హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ మరియు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్‌.

Akhil Akkineni teases Fans with Video Talk

వెంకటేష్‌ మాట్లాడుతూ... ''అఖిల్‌ రూపంలో ఒక కొత్త స్టార్‌ రాబోతున్నాడు. ఇక అక్కినేని అభిమానులకు పండగే. అఖిల్‌ ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు. వినాయక్‌ దర్శకత్వంలో తెరంగేట్రం అవ్వడం ఆనందంగా ఉంది''అన్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ''విక్టరీ మధుసూదనరావుగారి చేతుల మీదుగా తెరకు పరిచయమయ్యారు నాగార్జున. ఒక 'వి' ఉన్న దర్శకుడి చేతులమీదుగా పరిచయమైన నాగార్జున మంచి పేరు తెచ్చుకొన్నాడు. మూడు 'వి'లు ఉన్న వినాయక్‌ చేతులమీదుగా పరిచయమవుతున్న అఖిల్‌ మరింత పేరు తెచ్చుకొంటాడు''అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ... ''ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా. సినిమా అంటే అఖిల్‌కు ప్రాణం. తాను చేసే ప్రతి సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుందన్న నమ్మకముంది. దేశంలోని సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొంటాడన్న నమ్మకముంది''అన్నారు.

నితిన్‌ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ...''అఖిల్‌ను 'మనం' రూపంలో నాన్న ఆశీర్వదించారు. అఖిల్‌కు సూపర్‌ హిట్‌ సినిమా ఇస్తామని వినాయక్‌, నితిన్‌ మాటిచ్చారు. ఈ కథ నేనూ విన్నాను. చాలామంది ఇదొక ప్రేమకథ అనుకొంటున్నారు. అది నిజం కాదు. సినిమా నిండా మాస్‌ అంశాలు ఉన్నాయి''అన్నారు నాగార్జున.

అమల మాట్లాడుతూ....''అందరిలాగే అఖిల్‌ సినిమా గురించి నేనూ ఎదురు చూస్తున్నా. మా అబ్బాయిని అభిమానుల చేతుల్లో పెడుతున్నాను''అన్నారు.
అఖిల్‌ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

English summary
Akhil Akkineni is going to Thailand within a week for the next schedule of his launch pad. Before leaving the country, The Youngster wishes to release a video for keeping the positive buzz surrounding the crazy project alive. "A small video for you guys soon. Stay tuned !," he wrote on his Twitter page.
Please Wait while comments are loading...