»   »  ఈ ఇద్దరూ నా కొత్త ఫ్రెండ్స్: 3వ సినిమాతో బిజీ అయిన అఖిల్ అక్కినేని

ఈ ఇద్దరూ నా కొత్త ఫ్రెండ్స్: 3వ సినిమాతో బిజీ అయిన అఖిల్ అక్కినేని

Posted By:
Subscribe to Filmibeat Telugu

'హలో' సినిమాతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్న అఖిల్ అక్కినేని ఇటీవల ఉగాది సందర్భంగా తన 3వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 'తొలి ప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నట్లు, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని ఖరారు చేస్తూ అఖిల్ మరో ట్వీట్ చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. 'వీళ్లిద్దరూ నా కొత్త మిత్రులు. చాలా రోజుల నుంచి తెలిసినా.. వీళ్లిద్దరి గురించి మరింతగా తెలుసుకోబోతున్నానని అనుకుంటున్నా. మేం మా బెస్ట్‌ ఇస్తాం. ఇది కొత్త ప్రారంభం.' అంటూ ట్వీట్‌ చేశారు.

'తొలి ప్రేమ' చిత్రంలో వెంకీ పని తీరు నచ్చిన అఖిల్.... వెంటనే అతడిని తన తర్వాతి సినిమాకు దర్శకుడిగా సెట్ చేసుకున్నాడు. 'తొలి ప్రేమ' చిత్రంలో వరుణ్ తేజ్‌ను సరికొత్తగా చూపించిన వెంకీ అట్లూరి.... తన తర్వాతి సినిమాలో అఖిల్‌ను సరికొత్త మేకోవర్, క్యారెక్టరైజేషన్‌తో ప్రేక్షకుల ముందుకు తేబోతున్నాడు.

English summary
"Well these two are my two new buddies. Known them for a while but going to get to know them better I guess now :) we shall do our best 💪🏻 heres to new beginnings 👌🏻👌🏻👌🏻 MusicThaman dirvenky_atluri." Akhil Akkineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X