»   » ఆ ముస్లింను గాఢంగా కౌగిలించుకోవాలనుంది.. అఖిల్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)

ఆ ముస్లింను గాఢంగా కౌగిలించుకోవాలనుంది.. అఖిల్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ సినిమాలు, క్రికెట్, పబ్బులు, ఫ్రెండ్స్‌తో సరదాగా తిరిగే అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని సామాజిక అంశంపై దృష్టిపెట్టడం విశేషంగా మారింది. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ఓ ముస్లిం యువకుడు చేసిన ఓ పనిని వీడియో రూపంలో అఖిల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తున్నది.

మాంచెస్టర్ ఉగ్రదాడి తర్వాత..

మాంచెస్టర్ ఉగ్రదాడి తర్వాత..

మాంచెస్టర్ ఉగ్రదాడి తర్వాత ఓ అట్టముక్కపై కొన్ని వ్యాఖ్యలు రాసి రోడ్డుపై భక్తాష్ నూరీ అనే ముస్లిం యువకుడు కళ్లకు గంతలు కట్టుకొని నిలబడ్డాడు. ‘నేను ముస్లింను. నాకు మీపై నమ్మకం ఉంది. మీకు కూడా నాపై ఎలాంటి ద్వేషభావం లేదనుకుంటే నన్ను గాఢంగా కౌగిలించుకోండి అని ఓ అట్టముక్కపై రాయడం గమనార్హం.

యువకుడికి సంఘీభావం..

అలా నిలుచున్న యువకుడికి భరోసానిస్తూ పలువురు కౌగిలింతలతో సంఘీభావం తెలిపారు. మీకు అండగా ఉంటామని చెప్పారు. ఏదిఏమైనా మానవులుగా మనమంత ఒక్కటే చెప్పడం విశేషం.

మానవతా దృక్ఫథంతో..

మానవతా దృక్ఫథంతో..

అలా కొద్దిసేపటికే యువకుడికి సంఘీభావం తెలిపే వ్యక్తులు సంఖ్య భారీగా పెరిగిపోయింది. మానవతా దృక్పథంతో యువకుడికి ప్రేమను పంచుతున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉగ్రదాడిలో నా సోదరుడిని..

ఉగ్రదాడిలో నా సోదరుడిని..

ఉగ్రదాడి ఘటనలో నా సోదరుడిని కోల్పోయాను. అయినా నాకు ఎలాంటి ద్వేషం లేదని ఓ వ్యక్తి చెప్పడం ఆకట్టుకొంటున్నది. ఉగ్రదాడి తర్వాత ద్వేషాన్ని తగ్గిస్తూ ప్రేమను పంచడమే ధ్యేయంగా ఈ పనికి పూనుకొన్నానని నూరీ చెప్పడం విశేషం. మానవ విలువలకు ఆ వీడియో అద్దం పట్టింది.

English summary
Akkineni Akhil tweet get tremendous response in social media. After manchester attack, one muslim youth prays for peace. Many of manchester people hugged and told they were with him. This video tweeted by Akhil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu