»   » చిరు 150: అఖిల్ సందడి, యంగ్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్

చిరు 150: అఖిల్ సందడి, యంగ్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నంబరు 150' సెట్‌ లో ఇటీవల అక్కినేని యంగ్ హీరో అఖిల్‌ సందడి చేసారు. అఖిల్‌, వినాయక్‌ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అఖిల్ తో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు కూడా సెట్స్ కి వెళ్లారు. వివి వినాయక్‌తో, ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్న కాజల్ తో కాసేపు మెచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా రిలీజయ్యాయి.

కాగా... మెగా స్టార్ చిరంజీవికి నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫోటోలు రోజుకొకటి బయటకు లీక్ అవుతూ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. 61 ఏళ్ల వయసులోనూ చిరంజీవి యంగ్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సెట్లో అఖిల్

సెట్లో అఖిల్


ఇటీవల అఖిల్ అక్కినేని చిరంజీవి 150వ సినిమా సెట్స్ కు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటో ఇది.

కాజల్, దిల్ రాజు, హరీష్, వినాయక్

కాజల్, దిల్ రాజు, హరీష్, వినాయక్


దర్శకుడు హరీశ్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు కూడా సెట్స్ కి వెళ్లారు. వివి వినాయక్‌తో, ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్న కాజల్ తో కాసేపు మెచ్చటించారు.

మెగాస్టార్

మెగాస్టార్


మెగాస్టార్ 150వ సినిమాకు సంబంధించి సెట్స్ నుండి లీకైన ఫోటో ఇది.

యంగ్ లుక్

యంగ్ లుక్


61 సంవత్సరాల వయసులోనూ చిరంజీవి యంగ్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.

స్పెషల్ కేర్

స్పెషల్ కేర్


ఈ సినిమాలో చిరంజీవి లుక్ కు సంబంధించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది

వచ్చే ఏడాది


వచ్చే ఏడాదిలోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Akhil Akkineni and Team DuvvadaJagannadham on the sets of KhaidiNo150 yesterday.
Please Wait while comments are loading...