»   » ‘అఖిల్’ సెన్సార్ రిపోర్ట్, రన్ టైం అంతేనా?

‘అఖిల్’ సెన్సార్ రిపోర్ట్, రన్ టైం అంతేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అఖిల్'. దీపావళి కానుకగా ఈ సినిమా విడుల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ చిత్రానికి 'U/A' సర్టిపికెట్ జారీ చేసారు.

తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రం రన్ టైం 2 గంటల 10 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం. సినిమాలో అనవసర సీన్లును తొలగించి షార్ప్ గా ఎడిట్ చేసినట్లు సమాచారం. సినిమా మంచి టాక్ తో ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటే తర్వాత మరిన్ని సీన్లు కలిపే అవకాశం ఉంది.


Akhil Censor Report

నవంబర్ 11న సినిమా వరల్డ్ వైడ్ విడుదలవుతుండగా, నవంబర్ 10వ తేదీనే యూఎస్ఏలో ప్రీమియర్ షో వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న థర్డ్ జనరేషన్ హీరో కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


అఖిల్ అక్కినేని నటించిన తొలి చిత్రం ‘అఖిల్' దీపావళి సందర్భంగా నవంబర్ 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యవ హీరో నితిన్ నిర్మించాడు. ‘అఖిల్' విడుదల సమయానికి మార్కెట్లో ఇతర పెద్ద సినిమాలే ఏమీ లేవు. ‘అఖిల్' విడుదల నేపథ్యంలో రవితేజ ‘బెంగాల్ టైగర్' వాయిదా పడింది. రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' ఆల్రెడీ ఔటాఫ్ రేస్. ప్రస్తుతం బాక్సాఫీసు బరిలో ఉన్న ‘కంచె', ‘రాజుగారి గది' అప్పటి వరకు డౌన్ అవ్వొచ్చు.


‘అఖిల్' మూవీ దాదాపు ఎలాంటి పెద్ద సినిమాల పోటీ లేకుండానే విడుదలవుతోందని చెప్పొచ్చు. అయితే అఖిల్ సినిమా విడుదైలన మరుసటి రోజే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెలుగులో డబ్ అయి ‘ప్రేమ లీలా' పేరుతో విడుదలవుతోంది.


Akhil Censor Report

సల్మాన్ ఖాన్ కు తెలుగు మార్కెట్లో పెద్దగా బలం లేక పోయినా.... ఆ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం ‘అఖిల్' సినిమాకు గట్టి తప్పదు అంటున్నారు. సల్మాన్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడం, రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా కావడంతో మంచి టాక్ వస్తే వసూళ్లు కుమ్మేసే అవకాశం ఉంది.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ‘అఖిల్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil - The Power of Jua' obtained an 'U/A' Certificate from the Censor Board after the screening Today. So, The launch pad of the Akkineni Scion is all set to hit the screens on November 11th Worldwide in a grand manner. USA Premieres will be held on Nov 10th in a big way.
Please Wait while comments are loading...