»   » అఖిల్ టాప్ పొజిషన్, రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్

అఖిల్ టాప్ పొజిషన్, రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ తొలి రోజు బాక్సాఫీసు వద్ద తన పవర్ చూపించాడు. తొలి చిత్రంతోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించాడు. ఆయన నటించిన ‘అఖిల్' మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 9 కోట్ల షేర్ సాధించింది. ఒక డెబ్యూ హీరోకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం తెలుగులో ఇదే తొలిసారి. ఈ విషయంలో అఖిల్ అక్కినేని టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఈచిత్రం తొలి రోజు రూ. 8 కోట్ల మేర వసూలు చేసినట్లు అంచనా. యూఎస్ఏలో ఈ చిత్రం తొలి రోజు 90,268 డాలర్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు సమాచారం. డెబ్యూ హీరోకు ఈ రేంజిలో వసూలు రావడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలకే సాధ్యమైన కలెక్షన్ ఫిగర్లను అఖిల్ తొలి సినిమాకే రాబట్టగలిగాడు.

Akhil Openings: Rs 9 Cr share world wide

సీడెడ్ ఏరియాలో కూడా ‘అఖిల్' మూవీకి రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. తొలి రోజు ఈ ఏరియాలో దాదాపు రూ. 1.40 కోట్లు షేర్ సాధించినట్లు సమాచారం. తొలి సినిమాతోనే అఖిల్ అందరినీ ఆకట్టుకున్నాడు. డాన్సింగ్ స్కిల్స్, అదిరిపోయే యాక్షన్ స్టంట్స్, ఆకట్టుకునే లుక్స్ తో సూపర్బ్ అనిపించాడు. అఖిల్ భవిష్యత్తులో స్టార్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారంతా.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ‘అఖిల్' చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni film 'Akhil-The Power of Jua' had collected record amount on the opening day all over the world. Akhil got Rs 9 Cr share worldwide, which is a record for a debutant hero.
Please Wait while comments are loading...