»   » మాటల్లో చెప్పలేను....! మెగాస్టార్ తో సెల్ఫీ పోస్ట్ చేసిన అఖిల్

మాటల్లో చెప్పలేను....! మెగాస్టార్ తో సెల్ఫీ పోస్ట్ చేసిన అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి, అక్కినేని నాగార్జున కుటుంబానికి మ‌ధ్య స్నేహం ఎప్పట్నుంచో ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానే కాదు బిజినెస్ పార్త్నర్లుగా కూడా ఈ రెండు కుటుంబాలకు భాగ‌స్వామ్యం కూడా ఉంది. ఆ కారణం తో మీలో ఎవ‌రు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ను నాగార్జున తర్వాత ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడు.

మీలో ఎవరు కోటీశ్వరుడు

మీలో ఎవరు కోటీశ్వరుడు

మొదట్లో హోస్ట్ గా నాగార్జున ఈ ప్రోగ్రాం ని నడిపించినంత బాగా చిరంజీవి చేయలేకపోతున్నాడని టాక్ వచ్చినా తర్వాత తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. సెలబ్రిటీలు కూడా వచ్చే ఈ షో కి ఒక ఎపిసోడ్ కి అక్కినేని హీరో అఖిల్ గెస్ట్ గా వెళ్ళాడు.

మాటల్లో చెప్పలేను

మాటల్లో చెప్పలేను

చిరంజీవి ని చూస్తే ఎవ్వరికైనే ఫ్యాన్ మోమెంట్ రాక తప్పదు. చిన్నప్పటి నుండి ఆయన్ను చూస్తూ పెరిగిన కూడా అఖిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్లో ఒక ఫ్యాన్ లా సంబరాలు చేసుకున్నాడు. ఆ ముచ్చటే ఇక్కడ ఉన్న సెల్ఫిలో చెప్పాడు. "నేను మాటల్లో చెప్పలేను ఆ క్షణం ఎలా ఫీల్ అయ్యానో.

మెగాస్టార్ చూపిన ప్రేమ

మెగాస్టార్ చూపిన ప్రేమ

మెగాస్టార్ చూపిన ప్రేమ నన్ను మరింత ఆయనను ప్రేమించేలా చేసింది" అనీ తన ట్విటర్ లో చిరంజీవి తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ చెప్పాడు అఖిల్. చిరుతో క‌లిసి ఈ ప్రోగ్రామ్‌లో విప‌రీతంగా ఎంజాయ్ చేశాడు అఖిల్‌. ఆ విష‌యాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మీలో ఎవ‌రు కోటీశ్వరుడు

మీలో ఎవ‌రు కోటీశ్వరుడు

మీలో ఎవ‌రు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌లో మెగాస్టార్‌తో నేను ఎంత స‌ర‌దాగా గ‌డిపానో మాట‌ల్లో చెప్పలేను. ఆయ‌న న‌న్ను చాలా కంఫ‌ర్ట్‌గా ఉంచారు అని ట్వీట్ చేశాడు. అలాగే మెగాస్టార్ చేసిన ఓ సాయాన్ని కూడా అఖిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. బ్లూ క్రాస్ కి మెగాస్టార్ చిరంజీవి కొంత మొత్తాన్ని డొనేట్ చేసారని అందుకు చిరంజీవికి అఖిల్ కృతజ్ఞతలు తెలిపాడు.

బ్లూ క్రాస్ సంస్థ

బ్లూ క్రాస్ సంస్థ

బ్లూ క్రాస్ సంస్థ అఖిల్ తల్లి అమల అద్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని త్రయం ఇప్పుడు బాగా బిజీ గా ఉన్నారు అఖిల్ అన్న నాగ చైతన్య కొత్త సినిమా రా రాండోయి వేడుక చూద్దాం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా తన రెండో సినిమా కోసం పూర్తిగా ఫోకస్ లో ఉన్నాడు.

చైతూ కూడా

చైతూ కూడా

అలాగే నాగ్ కూడా రాజు గారి గది రిలీజ్ కోసం వెయిటింగ్. ఇకపోతే వీరందరూ అప్పుడప్పుడూ ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడులో తళుక్కుమంటున్నారు. రారండోయ్ కోసం చైతూ కూడా వెళ్తున్నాడన్న టాక్ కూడా నడుస్తోంది. అంటే నాగ చైతన్య కూడా ఇదే షోలో గెస్ట్ గా రానున్నాడంటే ఇంకో మెగా అక్కినేని సెల్ఫీ చూడ బోతున్నాం అన్నమాట.

English summary
Akkineni Akhil and Megastar Chiranjeevi appear together on one screen. Chiranjeevi is acting as host for “Meelo Yevaru Koteeswarudu”. Akhil also felt happy to participate in this show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu