»   » మాది స్టుపిడ్ ఫ్యామిలీ కాదు: అఖిల్ సక్సెస్ మీట్లో నాగార్జున

మాది స్టుపిడ్ ఫ్యామిలీ కాదు: అఖిల్ సక్సెస్ మీట్లో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్ నటించిన తొలి సినిమా ‘అఖిల్' తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో హీరో అఖిల్ తండ్రి నాగార్జునతో పాటు దర్శకుడు వివి వినాయక్, నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, నితిన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగార్జన మాట్లాడుతూ...‘అఖిల్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నేను, అమల చాలా ఆనంద పడ్డారు. తొలి రోజే రూ. 10 కోట్ల షేర్ అంటే మామూలు విషయం కాదు. తండ్రిగా గర్వంగా ఫీలవుతున్నాను. సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే మరింత ఆనందంగా ఉంది. మా సినిమాలు బి, సి సెంటర్లు చేరడానికి చాలా సమయం పట్టింది. కానీ అఖిల్ ను తొలి సినిమాతోనే వినాయక్ ఆ స్థాయికి తీసుకెళ్లాడు. తొలి సినిమాకే అఖిల్ అదరగొట్టాడు. అందుకే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను. అఖిల్ ను ఆదరిస్తున్న ప్రపంచంలోని తెలుగు వారందరికీ ధన్యవాదాలు. అఖిల్ తొలి సినిమాకే ఇంత స్కోప్ ఉంటే పది సినిమాల తర్వాత ఇంకెత స్కోప్ ఉంటుందా? అని ఆలోచిస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు.

అఖిల్ ను ఏ విషయంలో అయినా కోప్పడ్డారా? అనే ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ...నేను, అఖిల్ ఎప్పుడూ ఒకరిని ఒకరు కోప్పడుకోలేదు. అంత స్టుపిడ్ ఫ్యామిలీ కాదు మాది. మాది చాలా చక్కటి ఫ్యామిలీ. అఖిల్ కి, చైతన్యకి కోపమే రాదు. అలగడాలు లాంటివి స్టుపిడ్ పీపుల్ చేస్తారు. మా ఇంట్లో అలాంటివి ఎప్పుడూ లేవు అన్నారు నాగ్.

అఖిల్ సినిమా చూసిన తర్వాత అఖిల్ కి కొన్ని చెప్పాలి. కూర్చోబెట్టి చెబుతాను. అఖిల్ వాయిస్ చాలా బాగా సూటయింది. డాన్సులు అదరగొట్టాడు. అమల మంచి డాన్సర్. ఆమె జీన్స్ కూడా అఖిల్ కి కలిసి వచ్చాయి. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అన్నారు నాగార్జున.

స్లైడ్ షోలోఫోటోస్...

వివి వినాయక్

వివి వినాయక్


అఖిల్ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి. 10 కోట్ల షేర్ రావడం చాలా గ్రేట్. అఖిల్, సాయేషా చాలా బాగా చేసారు. సినిమా చూసిన వారంతా అఖిల్ డాన్స్, లొకేషన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కోసం అంతా చాలా కష్టపడ్డాం, రిజల్ట్ చూసి అంతా హ్యాపీగా ఉన్నారు అన్నారు.

నితిన్

నితిన్


అఖిల్ నాకు తమ్ముడు లాంటివాడు. డెబ్యూ హీరోకి తొలి రోజు. 9.8 కోట్ల షేర్ రావడం మామూలు విషయంకాదు. ఉదయం డివైడ్ టాక్ ఉందని చెప్పారు కానీ మ్యాట్నీ, ఈవినింగ్, నెక్ట్స్ డే కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సినిమా సూపర్ హిట్టయినట్లే అన్నారు.

సుధాకర్ రెడ్డి

సుధాకర్ రెడ్డి


నాగార్జున మమ్మల్ని నమ్మి అఖిల్ ని మా చేతిలో పెట్టారు. అఖిల్ చాలా కష్టపడ్డాడు. అండర్ వాటర్ ఎపిసోడ్ అఖిల్ చాలా డేర్ గా ఒక్కరోజులో పూర్తి చేసాడు. ఆరోజు పాతిక లక్షలు ఖర్చయింది. మరో హీరో అయితే మూడు రోజులకు తక్కువకాకుండా చేసేవాడు. 25 గంటల్లో అఖిల్ డబ్బింగ్ పూర్తి చేసాడు. అఖిల్ కష్టపడే తర్వాత అతన్ని త్వరలోనే హై రేంజికి తీసుకెలుతుంది అన్నారు.

అఖిల్

అఖిల్


ఫస్ట్ డే కాస్ట టెన్షన్ పడ్డాను. ఈ కలెక్షన్స్, నెంబర్స్ కొత్తగా ఉన్నాయి. మా సినిమాను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్ అన్నారు.

English summary
Akhil Success Meet event held at Hyderabad. Akkineni Nagarjuna, Akhil Akkineni, Sayesha Saigal, Brahmanandam and others graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu