»   » ‘ఐ లవ్ యూ మమ్మీ’: రేణు దేశాయ్‌కి కొడుకు లెటర్!

‘ఐ లవ్ యూ మమ్మీ’: రేణు దేశాయ్‌కి కొడుకు లెటర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ రోజు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు అకీరా నందన్ అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యా... అమ్మ పుట్టిరోజును తమదైన స్టైల్ లో సెలబ్రేట్ చేసారు. మరో వైపు రేణు దేశాయ్ కి ట్విట్టర్ ద్వారా అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

 Akira gift top Renu Desai

అకీరా రాసిన బర్త్ డే విషెస్ లెటర్ చూసి రేణుదేశాయ్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది.

‘హ్యాపీ బర్త్ డే మమ్మీ... ఐలవ్ యూ. నువ్వు లేకుంటే నేను ఇపుడు లేను... అంటూ ఎంతో అందమైన పదాలతో అకీరా రాసిన లెటర్ ఆకట్టుకుంటోంది. ఆ లెటర్ పై మీరూ ఓ లుక్కేయండి.

 Akira gift top Renu Desai

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె సహజీవనం, అనంతరం వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటుంన్నారు రేణు. నేడు రేణు దేశాయ్ పుట్టిన రోజు. నేటితో ఆమె 34వ వడిలోకి అడుగు పెడుతున్నారు.

మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు' చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది.

English summary
"Akira has gifted me the most beautiful and perfect words for my bday" Reni Desai said.
Please Wait while comments are loading...