»   » యాక్సిడెంట్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ కుమారుడికి సర్జరీ!

యాక్సిడెంట్ ఎఫెక్ట్: పవన్ కళ్యాణ్ కుమారుడికి సర్జరీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సైకిల్ మీద నుండి పడిపోయి తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినా వైద్యులు నిర్లక్ష్యంపై అకీరా తల్లి రేణు దేశాయ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కొడుకు బాధ చూసి తట్టుకోలేక పోయిన ఆ తల్లి మనసు తీవ్రంగానే స్పందించింది. పెద్ద ఆసుపత్రులకు వెళ్లే బదులు నేరుగా చనిపోవడం మేలంటూ కాస్త ఘాటుగానే మండి పడ్డారు.

ఈ విషయం తెలిసినప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన గానే ఉన్నారు. అకీరా పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. కొందరు అకీరా ఫోటోలు పోస్టు చేయాలని రేణు దేశాయ్ ని కోరారు. అయితే మోహానికి, ఎడమ కంటి వద్ద గాయాలు తీవ్రంగా కావడంతో బ్యాండేజ్ వేసారని, అందుకే అకీరా ఫోటోలు పోస్టు చేయడం లేదని రేణు దేశాయ్ వెల్లడించింది.

అంతే కాకుండా అకీరాకు చిన్నపాటి సర్జనీ కూడా చేయాల్సి ఉందని తెలిపింది. ఫ్రాక్చర్ అయిన చేతికి చిన్న సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించింది. అయితే పెద్దగా కంగారు పడాల్సిన సర్జరీ కాదని తెలిపారు. తన కుమారుడి క్షేమాన్ని కోరుకుంటూ ఎంతో మంది పార్థించడం కూడా స్పందించారు.

స్నేహితులతో కలిసి మెయిన్ రోడ్‌పై సైకిల్ తొక్కతుండగా ఉన్నట్టుండి గేర్ స్టక్ అవడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపి రేణు దేశాయ్.... అకీరాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. స్లైడ్ షోలో రేణు దేశాయ్ చేసిన ట్వీట్స్.

సైకిల్ యాక్సిడెంట్

సైకిల్ యాక్సిడెంట్


అకీరా సైకిల్ యాక్సిడెంట్ గురించి రేణు దేశాయ్ ట్వీట్

వైద్యుల నిర్లక్ష్యంపై ఫైర్..

వైద్యుల నిర్లక్ష్యంపై ఫైర్..


వైద్యుల నిర్లక్ష్యం మీద ఫైర్ అవుతూ రేణు దేశాయ్ చేసినట్ ట్వీట్.

గాయాలు

గాయాలు


అకీరా చేతికి, ఫేసు, మెకాలు, భుజం, ఎల్బో చాలా గాయాలయ్యాయంటూ రేణు దేశాయ్ ట్వీట్.

సర్జరీ

సర్జరీ


చేతికి చిన్న సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇంత మంది

ఇంత మంది


తన కుమారుడి క్షేమాన్ని కోరుకుంటూ ఎంతో మంది పార్థించడం కూడా స్పందించారు.

అందుకే ఫోటో పెట్టలేదు

అందుకే ఫోటో పెట్టలేదు


మోహానికి, ఎడమ కంటి వద్ద గాయాలు తీవ్రంగా కావడంతో బ్యాండేజ్ వేసారని, అందుకే అకీరా ఫోటోలు పోస్టు చేయడం లేదని రేణు దేశాయ్ వెల్లడించింది.

English summary
"He has a hand fracture, lots of face, knee, shoulder and elbow wounds. But he is okay now. Thank you sincerely for all the wishes for him. His wounds r healing,but hand fracture needs small surgery.He is safe.His cycle gear got stuck when cycling wit friends on the main rd&fell!" Renu Desai tweet about Akira.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu