For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కీరవాణి వాచ్ కొట్టేసిన అక్షయ్‌ కుమార్.. షాక్ (ఫోటోలతో...)

  By Srikanya
  |

  హైదరాబాద్: అక్షయ్‌ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కాజల్,అక్షయ్ కుమార్,కీరవాణి పాల్గొన్నారు. వీరిలో కాజల్ ఈ మీట్ లో చాలా ఉత్సాహంగా హంగామాగా కనిపించి కనువిందు చేసింది.

  మీడియావారి కోరిక మేరకు సినిమాలో తను పాడిన మెలోడి సాంగ్‌ను కీరవాణితో కలిసి పాడారు అక్షయ్. చివరిగా కీరవాణిని ఆత్మీయంగా హత్తుకున్నారు అక్షయ్. అనంతరం ''గమనించారా... కీరవాణి వాచ్ కొట్టేశాను. 'స్పెషల్ చబ్బీస్'లో నేను బోగస్ పోలీస్‌ని కదా. ఎంతగా పాత్రలో మమేకమైపోయానో చూశారా. వాచ్ తస్కరించేశా'' అనడంతో కీరవాణి తన చెయ్యి చూసుకుని షాక్ అయ్యారు. ఈ సమావేశం మొత్తం సరదాగా సాగింది.

  'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం 'స్పెషల్‌ ఛబ్బీస్‌'. కాజల్‌ హీరోయిన్. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సందడి చేసింది.

  అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ''1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. ఓ మంచి సందేశం కూడా ఈ సినిమాలో ఉంది. ఇందులో నేను ఓ పాట పాడాను. ఇదివరకే పాట పాడిన అనుభవం ఉన్నప్పటికీ... తొలిసారి ఒక పూర్తిస్థాయి నేపథ్య గాయకుడిగా మారి ఇందులో ఓ గీతాన్ని ఆలపించాను. పాడటం నిజంగా చాలా కష్టం. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి మంచి స్వరాలు సమకూర్చార''న్నారు.

  ‘హైదరాబాద్‌లో ఇంతకుముందు నేను ఎన్నో చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొన్నాను. వెంక నాగార్జున నాకు స్నేహితులు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో పోల్చితే తెలుగు చిత్రాల మార్కెట్ బాగుంది. తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని వుంది' అన్నారు అక్షయ్‌ కుమార్.

  మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కిస్తున్నారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీస్తున్నారు.

  ఈ చిత్రంలో నటించడం పట్ల ఈ సందర్భంగా కాజల్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాజల్ మాట్లాడుతూ''ప్రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో నేను నటించాను. అమాయకంగా కనిపించే ఒక సాధారణ యువతి పాత్ర అది. అక్షయ్‌ కుమార్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయనతో పనిచేయడం మంచి అనుభవం. సినిమాని ఆయన ఎంతో ప్రేమిస్తారు. ఇకపై కూడా ఆయనతో కలిసి నటిస్తాన''ని కాజల్‌ చెప్పారు

  హైదరాబాద్‌తో మీ అనుబంధం ఎలాంటిది? అన్న ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ... ''హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. చిత్ర పరిశ్రమకు ఓ స్వర్గంలాంటి నగరం ఇది. నేను నటించిన చాలా సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయ''న్నారు.

  ఎమ్‌.ఎమ్‌.కీరవాణి మాట్లాడుతూ ''నీరజ్‌ పాండేలాంటి దర్శకులు అరుదుగా ఉంటారు. ఆయన తీసిన 'వెడ్నస్‌ డే' చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం అందించడానికి ఒప్పుకొన్నాను. హిందీ ప్రేక్షకుల సంగీతాభిరుచి భిన్నంగా ఉంటుంది. అయితే పనిచేయడం మాత్రం అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది''అన్నారు.

  అక్షయ్‌ కుమార్‌తో పాట పాడించడం గురించి కీరవాణి మాట్లాడుతూ... ''అక్షయ్‌తో మొదట ఫోన్‌లో పాట పాడించాను. నాకు బాగా నచ్చింది. చిన్న పదాలతో సాగే సరదా పాటలు ఎవరైనా పాడతారు. కానీ ఇలాంటి ఓ మెలోడీని పాడటం చాలా కష్టం. అక్షయ్‌ చాలా బాగా పాడాడు''అన్నారు.

  అక్షయ్ మరో ప్రశ్నకు జవాబిస్తూ...''స్వతహాగా నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఇదివరకు రెండు, మూడు తెలుగు రీమేక్‌ చిత్రాల్లో నటించాను. మంచి కథ వస్తే నేరుగా తెలుగులో నటించాలని ఉంది. కావాలంటే స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేసుకోవచ్చు'' అన్నారు.

  అసిన్‌, త్రిష, కాజల్‌... ఇలా వరుసగా దక్షిణాది హీరోయిన్స్ తో నటిస్తున్నారు, కారణమేంటన్న ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ... ''అలా కుదురుతోందంతే. నేను అందరితోనూ కలిసి నటిస్తాను''అన్నారు.

  తెలుగులో మీకు ఇష్టమైన హీరోలు ఎవరని అడిగితే... ''వెంకటేష్‌, నాగార్జున అంటే నాకు బాగా ఇష్టం. వాళ్లిద్దరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది''అన్నారు.

  ఈ సమావేశంలో కీరవాణి, నీరజ్ పాండే తదితరులు కూడ పాల్గొన్నారు.

  English summary
  Bollywood hero Akshay Kumar, who is in Hyderabad to promote his upcoming film Special Chabbis in which he is romancing Kajal, expressed his desire to star in a Telugu film. Speaking to scribes Akki said “I really want to do a Telugu movie. The kind of films made here are larger than life. Personally, I love Venkatesh and Nagarjuna. Just give me one chance. I’m also ready to give my screen test.” Talking about the city, he said, “I have done shooting for many movies here. I would like to say Hyderabad is the LA of our country.”Akki said he is doing three more Tollywood remakes for which he bought the rights and are in pre production stages. Akki later danced with divine damsel Kajal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X