»   » అక్కినేని అభిమానులే రా రండోయ్.. షో ని అడ్డుకున్నారు... ఎందుకంటే

అక్కినేని అభిమానులే రా రండోయ్.. షో ని అడ్డుకున్నారు... ఎందుకంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాకి కాస్త హైప్ వస్తే చాలు అడ్దగోలు గా టికెట్ రేట్లు పెంచేసి క్యాష్ చేసుకునే దోరణి ఈ మధ్య మరీ ఎక్కువ అయ్యింది. ఒకప్పుడు బ్లాక్ టికెట్ల దందా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా అధికారికంగా నే థియేటర్లే బాహాటంగానే దోపిడీ మొదలుపెట్టాయి. సినిమా కి కాస్త మంచి అంచనాలు ఉంటే చాలు తొలి షోల కోసం తాత్కాలికంగా ఎక్కువ రేట్ వసూలు చేయటం మొదలు పెడుతున్నాయి...

రారండోయ్‌ వేడుక చూద్దాం

రారండోయ్‌ వేడుక చూద్దాం

ఎక్కువ ధర పెట్టి అభిమానులనుంచి డబ్బు లాగుదామనుకున్న థియేటర్ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య నటిం చిన సినిమా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం...' ఈ రోజే థియేటర్లలో కి వచ్చింది. అనంత పురం లో ఈ సిని మా ప్రదర్శనకు శాంతి, గౌరీ థియేటర్లకు మాత్ర మే అనుమతులు పొందాయి.


అనంత పురం లో

అనంత పురం లో

అయితే ఇష్టారాజ్యంగా టికెట్లని అమ్మి ప్రేక్షకులనుంచి ఎక్కువ మొత్తం లో డబ్బు లాగుదామని చూసారు ఈ థియేటర్ల యజమానులు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతి తీసుకోక పోగా కేవలం డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కై అనంత పురం లోని ఎస్వీ థియేటర్‌ యాజమాన్యం విరుద్ధంగా ఈ సినిమా షోకు సిద్ధమైంది.


150 నుంచి రూ.170 వరకూ వసూళ్లు

150 నుంచి రూ.170 వరకూ వసూళ్లు

అంతేకాకుండా అనుమతి ఉన్న థియేటర్లలో టికెట్‌ ధర రూ.100 వసూలు చేస్తుంటే.... ప్రదర్శనకు ఎలాంటి అను మతి లేని ఎస్వీ యాజమాన్యం ఏకంగా రూ. 150 నుంచి రూ.170 వరకూ అభిమానుల నుంచి వసూళ్లు చేసింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకులు, ప్రేక్షకులు థియేటర్ వద్ద ఆందోళనకు దిగటం తో కథ అడ్డం తిరిగింది.


సుమారు గంట పాటు

సుమారు గంట పాటు

అక్కినేని అభిమానులు థియేటర్ యాజమాన్యం చేసిన దోపిడీని అడ్డుకోవటమే కాక నిరసనకు దిగారు. సుమారు గంట పాటు థియేటర్‌ వద్ద ఆందోళన చేశారు. అంతే కాకుండా యాజమాన్యం నిర్వాకాన్ని ఆర్డీఓ, త హసీల్దార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవటం తో ఇక తామే థియేటర్ పని పట్టే పనిలో పడ్దారు.


ఫ్యాన్స్‌ షో నిలిపివేసారు

ఫ్యాన్స్‌ షో నిలిపివేసారు

ఆందోళనను అభిమానులు ఉధృతం చేశారు. దీంతో చేసేది లేక సదరు థియేటర్‌ యా జమాన్యం దిగివచ్చింది. ఫ్యాన్స్‌ షో నిలిపివేస్తున్నట్టు ప్రకటించటమే కాదు అభిమానులు, ప్రేక్షకుల నుంచి వసూలు చేసిన టికెట్‌ల డబ్బు ని కూడా వెనక్కు ఇచ్చేసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన యాజ మాన్య వైఖరిపై, ఎలాంటి స్పందన లేని అధికా రుల తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


దోపిడీ కి తలొగ్గేది లేదు

దోపిడీ కి తలొగ్గేది లేదు

అయితే ఎస్వీ థియేటర్లో సినిమా ప్రదర్శన నిలిపివేయడంతో అక్కడినుంచి అభిమానులు, ప్రేక్షకులు పట్టనం లోని శాంతి, గౌరి థియేటర్ల వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కొన్ని టికెట్లు అమ్ముడు పోగా ఉన్న టికెట్ల కోసం అభిమానులు, ప్రేక్షకులు బారులుతీరారు. దీంతో ఆ థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా సందడి వా తావరణం, కోలాహలం కనిపించింది. మొత్తానికి ఈ దోపిడీ కి తలొగ్గేది లేదని నిరూపించారు అక్కినేని ఫ్యాన్స్.English summary
Akkineni fans protest against SV theater in Anantapur, who are collecting extra money on Rarandoy Veduka chuddam movie Tickets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu