»   » నాగ చైతన్య కొత్త బైక్ ఇదే ... 27 లక్షల ఖరీదు .. రిజిస్ట్రేషన్ నంబర్

నాగ చైతన్య కొత్త బైక్ ఇదే ... 27 లక్షల ఖరీదు .. రిజిస్ట్రేషన్ నంబర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో మంగళవారం సినీహీరో అక్కినేని నాగచైతన్య సందడిచేశాడు. కొత్తగా కొన్న అగస్టాసూపర్‌బైక్‌కు రిజిస్ర్టేషన్‌ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం 11.30గంటల సమయంలో ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. ఆర్టీఏ అధికారులు సత్యనారాయణ, సాయిరాంరెడ్డి, విజయ్‌రావు నాగచైతన్యతో డిజిటల్‌ సంతకం చేయించారు. అనంతరం బైక్‌కు టీఎస్‌ 07ఎఫ్‌ఎం2003 నంబర్‌ కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

 Akkineni Naga chaitanya creates a flutter at Kondapur RTO Office

నాగచైతన్య వద్ద ఓ యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 స్పోర్ట్స్ బైక్, హోండా‌కు చెందిన మరో స్పోర్ట్స్ బైక్‌తో పాటుగా పలు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. గతం లో ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సూపర్‌బైక్ లవ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. నాగచైతన్యకు కార్ల కన్నా బైకులంటే ఎక్కువ ఇష్టమట.

అందరి మాదిరిగానే తాను తొలుత వివిధ రకాల 100సీసీ బైక్‌లపై బైక్ రైడింగ్ నేర్చుకున్నాని, తన తొలి బైక్ హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ అని చెప్పారు. ఈ బైక్‌ను ఓ ఏడాది నడిపిన తర్వాత కవాసకి నిన్జా జెడ్ఎక్స్-636 బైక్‌కు మారానని నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతే కాదు ఈ అక్కినేని చిన్నోడికి కార్/బైక్ రేస్‌లు చూడటమంటే ఇష్టమట. తాను చెన్నైలో ఉన్నప్పుడు ల్యాన్సర్ కారుతోను, హైదరాబాద్‍‌కు వచ్చిన తర్వాత ఫెరారీ కారుతోనూ సరాదాగా డ్రాగ్ రేస్‌లు చేసేవాడట.

 Akkineni Naga chaitanya creates a flutter at Kondapur RTO Office

ఇక మరో విషమేమిటో తెలుసా బైక్ లంటే పిచ్చి ప్రేమ ఉన్న నాగచైతన్య కొత్తగా ముచ్చట పడి కొన్న ఈ అగస్టాసూపర్‌బైక్‌ ఖరీదు జస్ట్ 27 లక్షలట. దీనికోసం 4.5 లక్షల లైఫ్ ట్యాక్స్ కూడా చెల్లించాడు చైతూ.ఇలా నాగచైతన్య ఖరీదైన బైక్ కొనటం ఆర్టీఏ కార్యలయానికి రావటం ఇదే మొదటిసారి కాదు.

ఆరేళ్ళ క్రితం 2010 లొ కూడా యమహా వైజడ్‌ ఎఫ్‌ ఎఫ్‌ ఆర్‌1 రిజిస్ట్రేషన్‌ కోసం స్వయంగా వచ్చాడు చై, అప్పట్లో ఆ స్పోర్ట్స్‌ బైక్‌ ఖరీదు కూడా తక్కువేం కాదు అక్షరాల రూ.12.40 లక్షలు. అప్ప్ట్లో దానికోసం కట్టిన లైఫ్ ట్యాక్స్ రూ.లక్షా 11 వేలు. దాని రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఏపీ 9బిఎక్స్‌ 4568. తన కలెక్షన్ లో ఇప్పుడు మరో బైక్ కూడా చేరింది.

English summary
Tollywood actor Naga Chaitanya caused a stir at the office of Road Transport Officer (RTO), at Kairatabad, when he arrived to get his bike registered.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu