»   » అసలు నాగ చైతన్య తప్పుకోవటానికి కారణం ఇదేనా..?? డబ్బింగ్ తో సరిపెడుతున్నారు

అసలు నాగ చైతన్య తప్పుకోవటానికి కారణం ఇదేనా..?? డబ్బింగ్ తో సరిపెడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్-ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్ ఆ క్రమంలో తాను తెలుసుకున్న నిజాలేంటి? అవతల చైన్ స్నాచర్-ల లక్ష్యమేంటి? అనే కథాంశంతో తెరకెక్కిన మెట్రో తమిళనాట సంచలన విజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించ బడింది మెట్రో. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నట్టు ఆమధ్య వారతలు వచ్చాయి. ఈ సినిమాలో నాగ చైతన్యని హీరోగా తీసుకున్నట్టూ. త్వరలోనే సినిమాని సెట్స్ మీదిక్కి తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నంత వరకూ వచ్చిన సినిమా ఎందుకో గానీ సడెంగా వార్తల్లోంచి పక్కకు తప్పుకుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌ గురించి పేపర్ల ద్వారా, న్యూస్‌ ఛానల్స్‌ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలాంటి చైన్‌ స్నాచింగ్‌లు జీవితాల్లో ఎలాంటి చిచ్చులు పెడతాయనే ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొని రూపొందించిన చిత్రం 'మెట్రో'. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించి, మొదటి వారమే 16 కోట్లు కలెక్ట్‌ చేసింది. తెలుగులో రీమేక్ అవనుందనే వార్తతో పాటు ఇందులో నాగ చైతన్య హీరోగా కనిపించనున్నాడనే వార్త తో ఆసక్తి నెలకొంది...

Akkineni Naga Chaitanya Rejects Metro Movie Remake

కొన్ని నెలల కిందటే విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది ఈ థ్రిల్లర్ మూవీ. అందరూ దాదాపుగా కొత్తవాళ్లే నటించారు. ఆనందకృష్ణన్ అనే యువ దర్శకుడు రూపొందించాడు. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే తెలుగుతో పాటు మరికొన్ని భాషల నుంచి రీమేక్ కోసం ఆఫర్లు వచ్చాయి. ఆదితో 'చుట్టాలబ్బాయి' తీసిన రామ్ తాళ్లూరి, వెంకట్ ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. చైతూతో సంప్రదింపులు కూడా జరిపారు. రీమేక్ గురించి ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. కానీ కెరీర్లో రీమేక్‌లు మరీ ఎక్కువైపోతే బాగోదనుకున్నాడో ఏమో.. చైతూ ఈ సినిమాకు నో చెప్పేశాడు. దీంతో రీమేక్ పనులు పక్కనబెట్టేసి.. 'మెట్రో' సినిమాను డబ్బింగ్ చేయడానికి పూనుకున్నారు నిర్మాతలు. అదే పేరుతో తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది.

కానీ చైతూ ఈ సినిమాకి ఎందుకు నో చెప్పాడసలు?? ప్రేమమ్ హిట్ తో హ్యాపీగా ఉన్నాడు నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో కి కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయినా ఎందుకు వద్దన్నాడు చైతూ ఆలోచన ఏమిటీ అంటే... దసరాకు వచ్చి మంచి వసూళ్లు సాధిస్తున్న 'ప్రేమమ్' మలయాళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో తొలిసారి చైతూ చేయబోతున్న సినిమా కూడా రీమేకే. పంజాబీలో రామానాయుడు నిర్మించిన 'సింగ్ వెర్సస్ కౌర్' చిత్రాన్ని కృష్ణ అనే కొత్త దర్శకుడితో రీమేక్ చేస్తున్నారు. మరోవైపు హిందీ సూపర్ హిట్ మూవీ '2 స్టేట్స్'ను కూడా తెలుగులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో చైతూనే దాదాపుగా హీరోగా కన్ఫమ్ అయ్యాడు ఇలా వరుసగా అన్నీ రీమేక్ లే అంటే తనకి మరీ గుర్తింపు లేకుండా పోతుందనీ తన పెర్ఫార్మెన్స్ చూపించే వకాశం ఉండదనీ ఫీలవుతున్నట్టున్నాడు చైతూ..

English summary
Latest Buzz in Tollywood that Akkineni Naga Chaitanya Rejects Metro Movie Remake so the Producers planing to Dub the Movie to telugu
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu