»   » బెడ్డుపై నుండే ‘మనం’ డబ్బింగ్ చెప్పిన అక్కినేని

బెడ్డుపై నుండే ‘మనం’ డబ్బింగ్ చెప్పిన అక్కినేని

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఈ నెల 22న మరణించిన తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'మనం' సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనం షూటింగు సమయంలోనే అస్వస్థతకు గురైన అక్కినేని....క్యాన్సర్ అని తేలడంతో సర్జరీ చేయించుకున్నారు.

  'మనం' సినిమాలో అక్కినేని నటించాల్సిన టాకీ పార్టు సర్జీకి ముందే పూర్తయింది. అయితే డబ్బింగ్ మాత్రం పెండింగులో ఉంది. సర్జరీ పూర్తయిన తర్వాత 15 రోజుకు బెడ్డుపై నుండే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసారట అక్కినేని. ఈ విషయాలను నాగార్జున స్వయంగా వెల్లడించారు.

   Akkineni Nageshwara Rao dubbed for his film from his death bed

  'నాన్నకు క్యాన్సర్‌కు సంబంధించిన సర్జీరీ పూర్తయి అప్పటికి 15 రోజులు పూర్తయింది. ఇంకా బెడ్‌పైనే ఉన్నారు. అపుడు ఆయన డబ్బింగ్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ అక్కడికే తెప్పించమని కోరారు. అక్కడే 'మనం' సినిమాకు తన డబ్బింగ్ పూర్తి పూర్తి చేస్తానని చెప్పారు. మున్ముందు నేను డబ్బింగ్ చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు...మిమిక్రీ ఆర్టిస్టుతో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించే పరిస్థితి రాకూడదు అన్నారు. ఆయన పట్టుబడట్టడంతో బెడ్ పై నుండే డబ్బింగ్ కార్యక్రమం పూర్తి చేసాం' అన్నారు నాగార్జున.

  అక్కినేని నాగేశ్వరరావు మరణంతో ఆయన కుటుంబంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ, అభిమాన లోకం మొత్తం విషాదంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. అక్కినేని మరణించినప్పటి నుండి ఇంటికే పరిమితమైన ఆయన తనయుడు నాగార్జున.....తొలి పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

  నాన్నకు 'మనం' సినిమా ద్వారా ఫేర్వెల్ ఇవ్వబోతున్నామని, సినిమానే జీవితంగా బ్రతికిన నాన్నగారికి ఆయన నటించిన ఈ చివరి సినిమాను ప్రేక్షకులు ముందుకు తేవడమే ఆయనకు సరైన వీడ్కోలు అని నాగార్జున తన అఫీషియల్ సోషల్ నెట్కవర్కింగ్ పేజీలో పేర్కొన్నారు.

  'మనం' సినిమాలో ఒక సాంగు మినహా నాన్నగారు నటించే పార్ట్ మొత్తం పూర్తయింది. ఇందులో నాన్న 90 ఏళ్ల ఓల్డ్ మ్యాన్‌గా కనిపించబోతున్నారు. సినిమాలో 1920 నుంచి 2013 మధ్య జరిగిన సంఘటనలు ఉంటాయి. ఈ సినిమాను నాన్నగారికి ఇచ్చే గౌరవ ప్రదమైన వీడ్కోలుగా భావిస్తున్నాను అని నాగార్జున తెలిపారు. మార్చి 31న 'మనం' సినిమాను విడుదల చేస్తున్నట్లు నాగార్జున తెలిపారు.

  ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

  English summary
  Akkineni Nageswara Rao had completed the shooting of Manam, except a song. Talking about its filming, Nagarjuna commented, "The film spans a period from 1920 to 2013. My father plays a 90-year old. Except that incomplete song he completed all the shooting." Nagarjuna further poste "Fifteen days after surgery he was at home in bed when he said, 'Bring all the dubbing equipment and do my dubbing for 'Manam' before I get worse, or you will get a mimicry artiste to do my dubbing. He made sure we he completed the film. It's now being released on March 31st."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more