»   » సెలబ్రేషన్స్, అక్కినేని ఇంటికి ప్రముఖుల క్యూ..(ఫోటోలు)

సెలబ్రేషన్స్, అక్కినేని ఇంటికి ప్రముఖుల క్యూ..(ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నట సామ్రాట్, పద్మ విభూషన్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఈ రోజుతో 90వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఆయన ఇంటికి క్యూ కట్టారు.

  అక్కినేని గురించి వివరాల్లోకి వెలితే...ఆయన 1924 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను ధరించాడు. 1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం.

  స్లైడ్ షోలో ఈ రోజు ఆయన నివాసంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలతో పాటు, ఆయన సినీ జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం...

  హీరోగా తొలి సినిమా..

  హీరోగా తొలి సినిమా..

  అయితే పూర్తి స్థాయి కధా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగుతోంది.

  సీరియళ్లలో కూడా

  సీరియళ్లలో కూడా

  సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటనా ప్రతిభను మనం చూడవచ్చు...

  సంఘజీవిగా కూడా...

  సంఘజీవిగా కూడా...

  మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట A N R COLLEGE అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.

  నిర్మాతగా

  నిర్మాతగా

  విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ ఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించాడు.

  అక్కినేని కుటుంబం

  అక్కినేని కుటుంబం

  అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు.ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు.అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా.. కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు.

  90 ఏళ్ల కుర్రాడు

  90 ఏళ్ల కుర్రాడు

  ఆయన అనుభవం ఇప్పుడు సినిమా ఇండస్ర్టీలో వున్న వాళ్ల వయసు కంటే ఎక్కువ. కానీ ఇప్పటికీ యువనాయకులతో పోటీపడగల ఉత్సాహం ఆయన సొంతం. అతనో 90 ఏళ్ల కుర్రాడు.

  పుట్టినరోజు ఆలస్యంగా...

  పుట్టినరోజు ఆలస్యంగా...

  అసలు అక్కినేని గారి పుట్టినరోజు ఎప్పుడో ఆయనకు 20 ఏళ్లు వచ్చేవరకూ తెలియదట. తెలుసుకోవలసిన అవసరం కూడా రాలేదని అంటారు ఆయన. కానీ ఓ సారి ఐదు వేల రూపాయలకు భీమా పాలసి తీసుకున్నారు. అప్పుడే పుట్టినరోజు తెలుసుకోవలసిన అవసరం వచ్చిందట.

  అదీ సంగతి

  అదీ సంగతి

  అప్పుడు గుడివాడలోని తాలూకా ఆఫీసులో పాత రికార్డులన్నీ తిరగేస్తే 1924 సెపెంబరు 21, ఆదివారం పుట్టారని రాసివుంది. కానీ వారి అమ్మగారేమో నువ్వు శనివారం పుట్టావురా అబ్బాయ్ అని ఖచ్చితంగా చెప్పిందట. తర్వాత తెలిసిందేమిటంటే వారుంటున్న వెంకట్రాఘవపురం నుండీ గుడివాడలోనున్న తాలూకా ఆఫీసు రికార్డుల్లో నమోదుచేయించడం ఒక రోజు ఆలస్యం అయిందట.

  అభిమానులు

  అభిమానులు

  ఆయన నటించిన 'బుద్దిమంతుడు' చిత్రం సెపెంబరు 20న విడుదలయిందట. పోస్టర్ల మీద పుట్టినరోజు విడుదల అని సదురు నిర్మాత అడిగాడట. సరే అన్నారట అక్కినేని. దీంతో ఆయన అభిమానులకు ఆయన పుట్టిన రోజును జరుపుకొనే అవకాశం వచ్చింది.

  మనం చిత్రంలో..

  మనం చిత్రంలో..

  ఇపుడు కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి ‘మనం' చిత్రంలో నటిస్తున్నారు. ఆయన వయసు 90 అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా హుషారుగా వుంటారు. దీనికి ఆయన క్రమశిక్షనతో కూడుకున్న దినచర్యే కారణం.

  సుధీర్ఘ నట జీవితం

  సుధీర్ఘ నట జీవితం

  తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. నేటితో 90 ఏళ్ల వయసులో అడుగు పెడుతున్న ఆయన 75 ఏళ్లకు పైగా ఈ రంగంలో కొనసాగుతున్నారు.

  రికార్డే మరి...

  రికార్డే మరి...

  90 ఏళ్ల వయసులో అడుగు పెడుతున్న ఆయన 75 ఏళ్లకు పైగా ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లు సినీ నటుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశారు.

  తీరని కోరికలు

  తీరని కోరికలు

  అయితే సీనియర్ అక్కినేనికి తీరని కోరికలు ఇంకా రెండు ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మసులోని మాట బయట పెట్టారు. తెలుగు కవి యోగి వేమన, రామకృష్ణ పరమ హంసలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఇష్టపడే ఈ ఇద్దరి పాత్రలు చేసే అవకాశం రాలేదని అక్కినేని చెప్పుకొచ్చారు.

  ఎవరూ ఆ ప్రయోగం చేయలేదు

  ఎవరూ ఆ ప్రయోగం చేయలేదు

  యోగి వేమన గొప్పకవి. ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అలాగే రామకృష్ణ పరమ హంసగా కూడా నటించాలనుకున్నాను అని తెలిపారు. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగలననేది నా నమ్మకం. కానీ నేను నటించే సమయంలో ఎవరూ ఈ ప్రయోగం చేయలేదని చెప్పుకొచ్చారు.

  ఇప్పుడేమో ఇలా...

  ఇప్పుడేమో ఇలా...

  ఇటీవల ఒకరు నన్ను అడిగారు కానీ.... నా వయసు ఆ పాత్రకు సరితూగదని తిరస్కరించినట్లు అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

  మార్కెట్ పెంచుకోవాలంటున్న అక్కినేని

  మార్కెట్ పెంచుకోవాలంటున్న అక్కినేని

  దక్షిణాది సినీ పరిశ్రమ ఉత్తరాదికి ధీటుగా ఎదుగుతోందని. అయితే ఉత్తరాదితో పోలిస్తే...దక్షిణాది సినిమా మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని అక్కినేని సూచించారు.

  తన అదృష్టమే అని ఒప్పుకున్నారు

  తన అదృష్టమే అని ఒప్పుకున్నారు

  సినీ పరిశ్రమలో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎలాంటి కష్టాలు లేకుండా ఈ స్థాయికి ఎదగడం తన అదృష్టమన్నారు.

  English summary
  Dr Akkineni Nageswara Rao's 90th birthday was held in Hyderabad. Akkineni fans from all over the state have come to wish him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more