»   » అశ్రు నయనాలతో అక్కినేనికి వీడ్కోలు (ఫోటోలు)

అశ్రు నయనాలతో అక్కినేనికి వీడ్కోలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రు నయనాలతో ఈ సినీ దిగ్గజానికి కన్నీటి వీడ్కోలు పలికారు. అక్కినేని పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ చితికి నిప్పంటించారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకు ముందు ముందు ఫిల్మ్ చాంబర్ నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు జరిగిన అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.

అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అక్కినేని వెంకట్

అక్కినేని వెంకట్


అక్కినేని పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ చితికి నిప్పంటించారు.

అక్కినేని వారసులు

అక్కినేని వారసులు


అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని తమ భులపై పెట్టుకుని మోసుకొస్తున్న వారసులు.

నాగార్జున

నాగార్జున


తండ్రి అంత్యక్రియల్లో అక్కినేని తనయుడు నాగార్జున, కూతురు నాగ సుశీల

మనవళ్లు

మనవళ్లు


అక్కినేని అంత్యక్రియల్లో నాగార్జున, సుమంత్, వెంకట్, అఖిల్, సుశాంత్ తదితరులు

పోలీసుల గౌరవ వందనం

పోలీసుల గౌరవ వందనం


రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు.

కంటతడి

కంటతడి


తండ్రి అంత్యక్రియల్లో కంటతడి పెట్టిన నాగార్జున, వెంకట్ తదితరులు

చలించిన అభిమానులు

చలించిన అభిమానులు


అక్కినేని మరణం తట్టుకోలేక ఆయన వారుసులు కంటతడి పెట్టడంతో పలువురు అభిమానులు చలించిపోయారు.

సినీ ప్రముఖులు

సినీ ప్రముఖులు


అక్కినేని అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అంతిమ వీడ్కోలు

అంతిమ వీడ్కోలు


అక్కినేనికి వీడ్కోలు పలుకుతూ నటి జీవిత

రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు


అక్కినేని అంత్యక్రియల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

శ్రీదేవి

శ్రీదేవి


అక్కినేనితో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి ఆయన అంత్యక్రియకు హాజరయ్యారు.

వీడ్కోలు ఏఎన్నార్

వీడ్కోలు ఏఎన్నార్


అక్కినేని నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.....వన్ ఇండియా తరుపున ఆయనకు వీడ్కోలు పలుకుదాం

English summary
Akkineni Nageswara Rao cremation held at Annapurna Studios today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu