twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    90 ఏళ్ల అక్కినేనికి తీరని కోరికలేంటో తెలుసా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. నేటితో 90 ఏళ్ల వయసులో అడుగు పెడుతున్న ఆయన 75 ఏళ్లకు పైగా ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లు సినీ నటుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశారు.

    అయితే సీనియర్ అక్కినేనికి తీరని కోరికలు ఇంకా రెండు ఉన్నాయట. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మసులోని మాట బయట పెట్టారు. తెలుగు కవి యోగి వేమన, రామకృష్ణ పరమ హంసలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఇష్టపడే ఈ ఇద్దరి పాత్రలు చేసే అవకాశం రాలేదని అక్కినేని చెప్పుకొచ్చారు.

    యోగి వేమన గొప్పకవి. ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అలాగే రామకృష్ణ పరమ హంసగా కూడా నటించాలనుకున్నాను అని తెలిపారు. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగలననేది నా నమ్మకం. కానీ నేను నటించే సమయంలో ఎవరూ ఈ ప్రయోగం చేయలేదని చెప్పుకొచ్చారు.

    ఇటీవల ఒకరు నన్ను అడిగారు కానీ.... నా వయసు ఆ పాత్రకు సరితూగదని తిరస్కరించినట్లు అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. దక్షిణాది సినీ పరిశ్రమ ఉత్తరాదికి ధీటుగా ఎదుగుతోందని. అయితే ఉత్తరాదితో పోలిస్తే...దక్షిణాది సినిమా మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని అక్కినేని సూచించారు. సినీ పరిశ్రమలో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎలాంటి కష్టాలు లేకుండా ఈ స్థాయికి ఎదగడం తన అదృష్టమన్నారు.

    English summary
    "There are two roles that I wanted to do-The great Telugu poet Yogi Vemana and Ramakrishna Paramahamsa. I started growing a beard and that's when I thought I would be able to do justice to the role of Ramakrishna Paramahamsa. But no one was ready to experiment with that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X