మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ కోసం ఇంటర్నేషనల్ సింగర్
ప్రస్తుతం భారత్‌లో ఓ ఇంటర్నేషనల్ సింగర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇండియన్ మ్యూజిక్ లవర్స్ అతడంటే పడి చస్తున్నారు. అతనే అకోన్. షారుక్ ఖాన్ తాజా సినిమా రా.వన్ చిత్రంలో 'చమ్మక్ చలో" పాట పాడింది ఇతడే. ఈ పాట దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ను అకోన్ పై పడింది. ఆయనతో బిజినెస్ మ్యాన్ సినిమాలో ఓ పాట పాడించాలని డిసైడైనట్లు తెలుస్తూంది. అదే జరిగితే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి అంత పెద్ద సింగర్‌ను తెలుగు పాడించడం అంటే మాటలు కాదు, అతన్ని ఒప్పించడం కోసం దర్శక నిర్మాతలు అతనికి ఏం ఆఫర్ చేస్తారో? చూడాలి.
పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా బిజినెస్ మ్యాన్. మహేష్ సరసన కాజల్ లీడ్ రోల్ చేసో్తంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేసి జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్ : విజయ్, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : ఎస్.ఆర్. శేఖర్, డాన్స్ : దినేష్, కో డైరెక్టర్ : విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











