»   » శృతి హాసన్ కి కొంపలోనే కొత్త తలనొప్పి

శృతి హాసన్ కి కొంపలోనే కొత్త తలనొప్పి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొంపలోనే కుంపటి అన్న రీతిలో శృతిహాసన్ కు ఇంటినుంచే పోటీ ప్రారంభమైంది. కమల్ హాసన్ మరో కూతురు, శృతి సోదరి అక్షరహాసన్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేయటానికి ప్లాన్ చేసుకుంటోంది. అంతేగాక ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. టాప్ హీరోల కూతుళ్లు పరిశ్రమకు వస్తే వారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని చెప్పి మరీ కవ్వించింది. తన అక్కకు దక్కిన గుర్తింపును తాను కూడా పొందుతానని తెగిసి చెప్పింది. అలాగే తన అక్కమీద కానీ తన తండ్రి మీద కానీ ఆధారపడకుండా తను దూసుకుపోతానని వివరిస్తోంది. తన అక్కను ఉడికించటానకి చెప్తోందో సీరియస్ గానో అంటోందో కానీ శృతిని డైరక్ట్ గానే కామెంట్ చేస్తోంది.

అందులో భాగంగానే ఆమె బాలీవుడ్ లోని సినిమా ఫంక్షన్ లకు రెగ్యులర్ గా హాజరై అక్కడ హీరోలను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా తన అక్కలా ఫ్ల్లాప్ ఎంట్రీ ఇవ్వనని,అన్ని జాగ్రత్తలూ తీసుకునే సినిమా ఓకే చేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తన ఎంట్రీకి తగ్గ ప్లానులు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పింది. అయితే శృతి హాసన్ కి ఇది ఇష్టం లేదు. తాను సెటిలైన తర్వాత ఆమె ఇండస్ట్రీలోకి వస్తే బావుండునని భావిస్తోంది. కానీ అక్షర వినేటట్లు కనపడచం లేదు. ఇక శృతి ప్రస్తుతం సిద్దార్ద అండతో ఓహ్ మై ప్రెండ్ చిత్రం చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ చిత్రంలోనూ బుక్కైంది. బోయపాటి శ్రీను డైరక్ట్ చేసే ఆ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

English summary
It’s another Hassan chic getting herself prepared for the tinsel town. The second daughter to Kamal Hassan and Sarika is now paving her way towards the Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu