»   » టాయిలెట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా... ఒక స్టార్ హీరో ని ఇలా ఊహించగలరా

టాయిలెట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా... ఒక స్టార్ హీరో ని ఇలా ఊహించగలరా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టతింది పేరైన బాలీవుడ్లో మరో ఆసక్తికర కథాంశంతో 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' పేరుతో ఓ సినిమా రాబోతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ ప్రభావం జనాల మీద ఎంతుందో గానీ... చిత్ర రూపకర్తలు మాత్రం ఈ కాన్సెప్ట్ ను బాగా వాడుకుంటున్నారు.

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ

స్వచ్ఛ్ భారత్ ఇనిస్పిరేషన్ తో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే టైటిల్ పెట్టాడు. ఏ వెడ్నస్ డే, బేబి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కావడం... మోడీ స్వచ్ఛ భారత్ స్పూర్థితో తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో... ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి

ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి

ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ కట్టేందుకు సిద్ధపడతారు. అలాంటిది ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి కట్టించిన వ్యక్తి కథే ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ గతం లో ఒకసారి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈచిత్రంలో హీరోగా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినీమా ప్రమోషన్ లో భాగంగా తాను మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అనేది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని అందరు దీనిలో భాగస్వాములు కావాలన్నారు.ఆ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశాడు అక్షయ్.

టాయిలెట్ల పథకానికి అంబాసిడర్ గా

టాయిలెట్ల పథకానికి అంబాసిడర్ గా

సినిమా ప్రమోషన్ కోసం చెప్పినా హీరో గారు చెప్పిన మాటలలో ఎంతో వాస్తవం ఉంది. అందరూ పాటించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట బోయే మొబైల్ టాయిలెట్ల పథకానికి అంబాసిడర్ గా అక్షయ్ నే ఎంచుకున్నారు.. మన దేశం లో ఫోన్ బూత్ లు ఉన్నట్టు టాయిలెట్లు ఉండవు.

ప్రతీ 500 మీటర్ కు ఒక టాయిలెట్

ప్రతీ 500 మీటర్ కు ఒక టాయిలెట్

ఇప్పుడు అదే లాజిక్ తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవిస్ ఒక ప్రపోజల్ తో వచ్చారు. ముంబాయి లో ప్రతీ 500 మీటర్ కు ఒక టాయిలెట్ ఉండే విధంగా ఒక పథంక రూపొందించారు. మే 1 న 5000 మంది స్టూడెంట్స్ సమక్షం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే హీరో అక్షయ్ కుమార్ దేశం లో ఎక్కడ కాస్త నైతిక విలువలుకు విరుద్దంగా జరిగిన దానికి బాగా స్పందిస్తాడు. అలానే ఈ టాయిలెట్స్ ఐడియా ఒక మంచి కారణం కాబట్టి తను ప్రచారకర్తగా వ్యవహరించడానికి ముందుకు వచ్చాడు.

English summary
Akshay had urged the government to ensure that there are mobile toilets within every kilometre
Please Wait while comments are loading...