»   » లవ్లీ లేడీస్‌తో అక్షయ్.. చూపు తిప్పుకోలేకపోయా.. బంపర్ ఆఫర్

లవ్లీ లేడీస్‌తో అక్షయ్.. చూపు తిప్పుకోలేకపోయా.. బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్బీ2 చిత్రం మంచి టాక్‌నే సంపాదించుకొన్నది. ఆయన నటనపై అర్షద్ వార్సీ పలువురు మెచ్చుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ఫిబ్రవరి 10న విడుదలైంది. ఈ చిత్రంలో అక్షయ్ న్యాయవాది పాత్రలో నటించాడు. మిగితా పాత్రల్లో హ్యూమా ఖురేషీ, అన్నూ కపూర్, సౌరభ్ శుక్లా కనిపించారు.

 మిసెస్ ట్వింకిల్.. లవ్లీ లేడీస్‌తో ఖిలాడీ

మిసెస్ ట్వింకిల్.. లవ్లీ లేడీస్‌తో ఖిలాడీ


జాలీ ఎల్ఎల్బీ2 చిత్రానికి సానుకూల స్పందన వస్తుండటంతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జాలీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పలువురు మహిళలు, భార్య ట్వింకిల్ ఖాన్నాతో కలిసి మంచి మూడ్‌లో కనిపించారు. ‘భార్యతోపాటు లవ్లీ లేడీస్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీ సంగతేంటీ‌' అని ట్వీట్ చేశారు.

 అభిమానులకు అక్షయ్ బంపర్ ఆఫర్

అభిమానులకు అక్షయ్ బంపర్ ఆఫర్


చిత్ర సమీక్షకులకు, అభిమానులకు ఖిలాడీ అక్షయ్ కుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ‘నేను నటించిన చిత్రం జాలీ ఎల్ఎల్బీ2 విడుదలైంది. నాకు సంబంధించినంతవరకు ఆ చిత్రానికి మీరే న్యాయనిర్ణేతలు. మీ రివ్యూను #DirectJollyTak ట్యాగ్‌తో మూడు లైన్లలో రాసి నాకు పంపండి. స్కూటర్‌ను బహుమతిగా గెలుచుకోండి' అని ట్వీట్ చేశారు.

 చూపు మరల్చుకోలేకపోయాను.. అర్షద్ వార్సీ

చూపు మరల్చుకోలేకపోయాను.. అర్షద్ వార్సీ


జాలీ ఎల్ఎల్బీ2 చూసిన తర్వాత అక్షయ్ కుమార్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘తెరపై నిన్ను చూస్తున్నపుడు చూపు తిప్పుకోలేకపోయాను. సరదా సరదాగా, అద్భుతంగా నటించావు. నేను సినిమా చూస్తున్నంత సేపు బాగా ఎంజాయ్ చేశాను. జాలీ కొత్తగా ఉంది' అని అర్షద్ ట్వీట్ చేశాడు.

 జాతీయ నటుడి ప్రశంస.. థ్యాంక్యూ.. అక్షయ్

జాతీయ నటుడి ప్రశంస.. థ్యాంక్యూ.. అక్షయ్


అర్షద్ ట్వీట్‌పై స్పందిస్తూ జాతీయ అవార్డు గెలుచుకొన్న నటుడు ప్రశంసించాడు. థ్యాంక్స్ అర్షద్ అని అక్షయ్ ట్వీట్‌ చేశాడు. తొలుత జాలీ ఎల్ఎల్బీ2 చిత్రంలో అక్షయ్ పోషించిన పాత్రను అర్షద్ చేయాల్సింది. ఆ అవకాశం అక్షయ్ దక్కింది.

English summary
Bollywood Khiladi Akshay Kumar's new movie Jolly LLB2 hits Theatres on February 10. This movie is getting good talk from various sources. In this occassion he enjoying success moments with Twinkle Khanna and group of ladies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu