»   » 'విక్రమార్కుడు' చిత్రం హిందీ రీమేక్ కన్ఫర్మ్..పూర్తి వివరాలు

'విక్రమార్కుడు' చిత్రం హిందీ రీమేక్ కన్ఫర్మ్..పూర్తి వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన విక్రమార్కుడు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం మొన్నీ మధ్య తమిళంలో కార్తీ హీరోగా చిరుతై క్రింద రీమేకైంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవటానకి రెడీ అవుతోంది. రౌడీ రాధోడ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పోకిరీ ని వాంటెడ్ మార్చి బాలీవుడ్ లో హిట్ కొట్టిన ప్రభుదేవాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టుని అప్పచెప్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో అనూష్క పాత్రను చేయనుంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా గా రూపొందించటానికి ప్రభుదేవా గత కొద్ది రోజులుగా స్క్రిప్టు పై కసరత్తులు చేస్తున్నారు. అక్షయ్ కుమార్ సైతం చాలా రోజుల తర్వాత తాను ఇలాంటి మాస్ హీరో పాత్ర చేయటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

English summary
Sanjay Leela Bhansali bought the remake rights of Vikramarkudu and is producing this movie in Hindi as Rowdy Rathod. Prabhu Deva is roped in as the director of this film.Sonakshi Sinha is paired up with Akshay Kumar in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu