»   » అదిరింది: 'ఠాగూర్' హింది రీమేక్ ట్రైలర్(వీడియో)

అదిరింది: 'ఠాగూర్' హింది రీమేక్ ట్రైలర్(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ '. తెలుగు దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. చిత్రం యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. శృతిహాసన్‌ కథానాయిక. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందిన 'ఠాగూర్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వయాకామ్‌ 18 నెట్‌వర్క్‌, భన్సాలీ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విశేషాలకు వస్తే...

ఈ ఏడాది ఇప్పటికే బాలీవుడ్‌లో ‘జోగనియా', ‘సన్నాటా' పాటలను ఆలపించిన అందాల తార శ్రుతీ హాసన్‌ ఇటీవల ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' సినిమాలోనూ ఓ పాట పాడేసింది. ఈ పాటకు సంబంధించిన విశేషమేమంటే దాన్ని ఆమె ఎలాంటి బ్రేకులూ లేకుండా కేవలం గంట వ్యవధిలో పాడేయడం. ఈ పాటను సినిమాలో ఆమె మీదే చిత్రీకరించారు.

తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘రమణ' (తెలుగులో ‘ఠాగూర్‌')కు రీమేక్‌గా తెలుగు దర్శకుడు క్రిష్‌ రూపొందించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించాడు. తను హీరోయిన్ గా నటిస్తున్న ఓ తమిళ సినిమా షూటింగ్‌ సందర్భంగా శ్రుతి పొల్లాచ్చిలో ఉన్నప్పుడు ఓ పూటలో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌'లోని పాటను పాడాల్సి వచ్చింది.

‘‘అప్పటికప్పుడు ఆమె బెంజ్ కారులో రెండు గంటల్లో కోయంబత్తూరుకు చేరుకుని, అక్కణ్ణించి ఫ్లయిట్‌లో ముంబైలో దిగి, ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లింది. రికార్డింగ్‌కు వెళ్లేముందే ఆ పాటను కొద్దిసేపు ప్రాక్టీస్‌ చేసుకుంది. తన నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ చిరంతన్‌ భట్‌ ఏం కోరుకుంటున్నారో, సరిగ్గా అలాగే ఆ పాటను పాడింది. దీనికి కేవలం ఒక్క గంట పట్టింది.

Akshay Kumar's Gabbar is Back Trailer

పాట రికార్డింగ్‌ పూర్తవగానే ఆమె తిరిగి పొల్లాచ్చికి వెళ్లి షూటింగ్‌కు హాజరైంది'' అని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో కరీనా కపూర్‌, శ్రుతీహాసన్‌ నాయికలుగా నటించగా, ప్రకాశ్‌రాజ్‌, సోనూ సూద్‌ రెండు కీలక పాత్రలు చేశారు.

తన విధ్యార్ధులతో కలిసి లంచం తీసుకుంటున్న వాళ్ళని మట్టికరిపిస్తూ వుండే ఉపాధ్యాయపాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ పాత్రకోసం చాలా రోజులుగా అక్షయ్ కష్టపడ్డాడు. క్రిష్ కి ఇది పెద్ద ప్రొజెక్ట్. ఇప్పటివరకూ క్రిష్ ‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణంవందే జగద్గురుం' సినిమాలు తీశాడు. స్టార్ల విషయం, బడ్జెట్ విషయం లెక్కిస్తే క్రిష్ కు ఇదే పెద్ద ప్రొజెక్ట్ కానుంది.

ఇక ‘గబ్బర్' సినిమాలో సుమన్ విలన్ గా కనిపించనున్నాడు. సుమన్ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ ‘ ‘శివాజీ' సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ తన ఎత్తుకి, పర్సనాలిటీకి నేనైతే బాగుంటానని అక్షయ్ చెప్పడంతో క్రిష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ పాత్రలో నేను బాగుంటానని ‘గబ్బర్' మూవీకి సెలక్ట్ చేసారని' సుమన్

దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే...

'గబ్బర్' తర్వాత క్రిష్ తెలుగులో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో కంచె అనే చిత్రం డైరక్ట్ చేస్తు్న్నారు. క్రిష్ అభిరుచికి తగ్గట్టుగా, నటునిగా వరుణ్‌తేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే రీతిలో ఉండే కథాంశాన్ని క్రిష్ సిద్ధం చేసి,తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ 'ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్'పై ఈ చిత్రం రూపొందుతోంది

మకో ప్రక్క క్రిష్ త్వరలో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన సైవం చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఓ వెరైటి టైటిల్ అదీ తెలుగుతనం ఉట్టిపడే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌లో గబ్బర్ చిత్ర షూటింగ్‌ని పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ సైవం రీమేక్‌ని ఉషాకిరణ్ మూవీస్‌తో కలిసి నిర్మించారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి దాగుడుమూతలు దండాకోరు అనే టైటిల్‌ను ఖరారు చేసి ప్రోమోలు ఇప్పటికే వదిలారు.

English summary
Theatrical trailer of Akshay Kumar and Shruti Haasan starrer 'Gabbar is Back' which is an official remake of Tollywood hit 'Tagore' is finally out.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu