»   »  రోమాలు నిక్క బొడిచేలా తాప్సీ "నామ్ షబానా" ట్రైలర్ (వీడియో)

రోమాలు నిక్క బొడిచేలా తాప్సీ "నామ్ షబానా" ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీటౌన్ లో ఈ ఎడాది 'తాప్సీ' నటించిన 'పింక్‌' సూపర్ హిట్టు అయింది. అంతేకాదు ఈ సినిమా అవార్డుల మీద అవార్డుల్ని సొంతం చేసుకుంటోంది. 'పింక్' సినిమా ప్రమోషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ బ్యూటీకి ఈ మూవీ విజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాజాగా, 'నామ్‌ షబానా' ట్రైలర్‌కి ముందుగా మేకింగ్‌ టీజర్‌ని విడుదల చేశారు.

తెలుగులో గ్లామర్ తప్ప ఏం లేదు

తెలుగులో గ్లామర్ తప్ప ఏం లేదు

ఈ టీజర్‌లో తాప్సీ, యాక్షన్‌ సీన్స్‌ కోసం ప్రిపేరవుతున్న వైనాన్ని చూపించారు. నిజమే, తాప్సీ 'నామ్‌ షబానా' కోసం చాలా కష్టపడిందన్న భావన కలుగుతుంది టీజర్‌ని చూస్తే. తెలుగులో తాప్సీ చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఆమె గ్లామర్‌నే చూపించాయి. అసలు నటిగా తెలుగులో తాప్సీ ఎప్పుడూ పాస్‌ మార్కులు కూడా వేయించుకోలేదన్నది నిర్వివాదాంశం. వున్నంతలో 'సాహసం' కాస్త బెటర్‌ అనుకోవాలి.

నామ్ షబానా

నామ్ షబానా

బేబీ, పింక్ చిత్రాల్లో అద్వితీయ నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకొంది. తాజా చిత్రం నామ్ షబానాతో మరోసారి విలక్షణ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తాప్సి బాగా బిజీ అయిపోయింది. నామ్ షబానా అనే చిత్రం పూర్తిగా తాప్సి పాత్ర మీదే ఆధారపడిన చిత్రం.

బేబీ సినిమా కి ప్రీక్వెల్

బేబీ సినిమా కి ప్రీక్వెల్

బేబీ చిత్రంలో తాప్సి పోషించిన షబానా పాత్ర ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రీన్ టైం ఇస్తూ చేసిన ప్రయత్నమే నామ్ షబానా. ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది. ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది .

తెలుగు, హిందీ భాషలలో

తెలుగు, హిందీ భాషలలో

మార్చి 31,2017న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం నేనే షబాన అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇటీవల తెలుగు భాషకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన టీం తాజాగా హిందీలో థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

శివమ్‌నాయర్ దర్శకత్వం

శివమ్‌నాయర్ దర్శకత్వం

యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శివమ్‌నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పోస్టర్‌లో రెడ్ కలర్ సల్వార్ కమీజ్‌లో తీక్షణమైన చూపులతో ఢీ గ్లామర్ లుక్‌లో ఆకట్టుకుంది తాప్సీ. సమాజంలోని అసమానతలపై పోరాడే ధైర్యవంతురాలైన మహిళగా ఆమె పాత్ర ఛాలెంజింగ్‌గా, సహజత్వంతో కూడి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

rn

సరికొత్త పాత్రలో

కెరీర్‌లో ఇప్పటివరకూ కనిపించిన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు, మార్చి 31న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాప్పీ తెలిపింది. తన కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుందని చెప్పింది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Taapsee Pannu is back with yet another brilliant performance in her forthcoming flick, 'Naam Shabana', which also sees Akshay Kumar in an extended cameo.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu