»   » దాడి, దొంగతనం, ఇపుడు కొట్టుకున్న హీరోయిన్లు...ఏంటిదంతా?

దాడి, దొంగతనం, ఇపుడు కొట్టుకున్న హీరోయిన్లు...ఏంటిదంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల బాలీవుడ్లో ఓ సంఘటన సంచలనం క్రియేట్ చేసింది. హీరో రితేష్ దేశ్ ముఖ్ ఓ బట్టల షాపులో దొంగతనం చేసిన వీడియో చూసి అంతా షాకయ్యారు. ఆ తర్వాత ఇదంతా 'హౌస్ ఫుల్ 3' మూవీ పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది. తర్వాత రితేష్ దేష్ ముఖ్ ఓ రేడియో కార్యక్రమంలో స్టూడియోలో రేడియో జాకీ మొహం మీద నీళ్లు కొట్టి దాడి చేసాడు. ఇదీ కూడా పబ్లిసిటీలో భాగమే. వెరైటీగా సినిమాకు పబ్లిసిటీ కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారు.

తాజా ఇద్దరు హీరోయిన్లు ఓ పబ్లిక్ ఈ వెంటులో జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇది కూడా సినిమా పబ్లిసిటీలో భాగమే. బాలీవుడ్‌ నటీమణులు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, లీసా హేడెన్‌లు అభిమానులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

అహ్మదాబాద్‌లో 'హౌస్ ఫుల్ 3' కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం నిర్వహిస్తుండగా వీరిద్దరు గొడపడి ఒకరిజుట్టును మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. అదిచూసి అక్కడున్న అభిమానులు తొలుత షాకైనా అదంతా జస్ట్ ఫన్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వారిద్దరూ కొట్టుకుంటున్న సమయంలో హీరో అక్షయ్ కుమార్ వీడియో తీసిన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, అభిషేక్‌ బచ్చన్‌, నర్గిస్‌ ఫక్రి, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, లీసా హేడెన్‌లు జంటలుగా నటించారు. సాజిద్‌-ఫర్హాద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హీరోయిన్ల సిగపట్లు


బాలీవుడ్‌ నటీమణులు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, లీసా హేడెన్‌లు అభిమానులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

దొంగతనం


రితేష్ దేశ్ ముఖ్ దొంగతనం చేస్తున్నవీడియో.,..

రితేష్ దాడి


హౌస్ ఫుల్ 3 రేడియో ప్రమోషన్స్ సందర్భంగా రితేష్ దేశ్ ముఖ్ ఇలా దాడి చేసాడు.

rn

ట్రైలర్


హౌస్ ఫుల్ 3 మూవీ ట్రైలర్

English summary
"Witnessed women power in full glory in Ahmedabad today 😜 HOUSEFULL3 Next Friday! Watch out the claws are out" Akshay Kumar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu