twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తో నా రిలేషన్ కి అదే ప్రతీక: అలీ

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కమెడియన్ అలీ అనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అలీ మరోసారి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ...కెమెరామెన్‌ గంగతో రాంబాబు టైమ్‌లోనూ గంగ నేనే అనుకున్నారు. కానీ గంగ అమ్మాయి అని తర్వాత అందరికీ తెలిసింది. అది మా రిలేషన్‌కి ప్రతీక.. అని తెలిపారు.

    అలీ హీరోగా నటించిన 50వ చిత్రం 'ఆలీబాబా ఒక్కడే దొంగ'. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అలీ హైదరాబాద్‌లో విలేకర్ల మీడియాతో మాట్లాడారు. పవన్ తో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    "పవన్‌కల్యాణ్ ఇప్పటివరకూ 19 సినిమాలు చేస్తే 17 సినిమాల్లో నేను నటించాను. ఆయన కొంతమందితోనే బాగా దగ్గరవుతాడు. అలా దగ్గరైనవాళ్లలో నేనూ ఒకణ్ణి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రతిసారీ వర్కవుట్ అవడం ఆనందకరం'' అని చెప్పారు అలీ.

    ఇంకా పవన్ గురించి అలీ చెప్పిన మాటలు స్లైడ్ షోలో...

    అప్పట్నుంచే...

    అప్పట్నుంచే...

    'పవన్‌ మద్రాసులో పరిశ్రమ ఉన్నప్పట్నుంచి తెలుసు. అక్కడ మెగాస్టార్‌ సినిమా ముగ్గురు మొనగాళ్లు టైమ్‌లో అక్కడే ఉండేవాడిని. ఆ టైమ్‌లోనే పవన్‌ని నిత్యం కలిసేవాడిని. ఆ తర్వాత మా మధ్య స్నేహం కొనసాగింది.

    తొలి రోజుల్లో...

    తొలి రోజుల్లో...

    చిరంజీవిగారి ‘ముగ్గురుమొనగాళ్లు సినిమా సమయంలో నాకు పవన్‌కల్యాణ్ పరిచయమయ్యారు. అప్పుడు నేను మద్రాస్‌లో ఉండేవాణ్ణి. ఆయన తొలి, మలి సినిమాలు ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి', నేను లేను.

    తొలిసారి...

    తొలిసారి...

    ‘సుస్వాగతం' మేం కలిసి నటించిన తొలి సినిమా. ఈ సినిమా ఘన విజయం సాధించింది. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

     తొలి ప్రేమలో...

    తొలి ప్రేమలో...


    ‘తొలిప్రేమ'లో మా ఇద్దరిపై సన్నివేశాలెక్కువ. అలా మా స్నేహం బలపడింది. ఇక అప్పట్నుంచి పవన్ చేసిన ప్రతి సినిమాలో నేనున్నా. మా ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. అక్కడినుంచి అతడు నటించిన ప్రతి సినిమాలో నటించాను.

    పవన్ ప్రాధాన్యత..

    పవన్ ప్రాధాన్యత..

    బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనిషి పవన్‌కల్యాణ్. అమ్మ, నాన్న. అన్న... ఇలా ప్రతి బంధాన్నీ ప్రేమిస్తాడు.

    అలా అనుబంధం పెరిగింది..

    అలా అనుబంధం పెరిగింది..

    అలీ ఇంట్లోవాళ్లను బాగా చూసుకుంటాడు. అందరినీ సెటిల్‌ చేశాడు.. అని నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుని, ఇలాంటి మంచి వ్యక్తితో స్నేహం చేయాలని పవన్‌ అనుకున్నారు. వ్యక్తిగత క్వాలిటీస్‌ తెలుసుకునే ఆయన స్నేహం చేస్తారు. అందుకే నాటినుంచి మా అనుబంధం మరింత పెరిగింది అన్నారు.

    'ఆలీబాబా ఒక్కడే దొంగ' కాన్సెప్టు

    'ఆలీబాబా ఒక్కడే దొంగ' కాన్సెప్టు

    వంశీ తీసిన 'ఏప్రిల్ 1 విడుదల' తరహా సినిమా ఇది. ఇం దులో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. పల్లె నుంచి ఉద్యోగం కోసం ఓ యువకుడు నగరానికి వస్తాడు. ఎస్పై అవ్వాలనేది అతని కల. ఆ టైమ్‌లోనే ఓ ఏటీమ్‌లో పెట్టడానికి తీసుకెళ్తున్న డబ్బు దొంగతనానికి గురవుతుంది. ఆ నేరం అతనిపై పడుతుంది. ఆ నేరం నుంచి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు, తన కలను సాకారం చేసుకున్నాడా? లేడా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

    ఆ కమెడియన్‌ను నేనే

    ఆ కమెడియన్‌ను నేనే

    దక్షిణాదిన ఎక్కువ భాషల్లో నటించిన కమెడియన్‌ను నేనే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. 35 ఏళ్లలో ఈ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించాను.

    గుర్తు పట్టి మరీ...

    గుర్తు పట్టి మరీ...

    లడఖ్‌లో 'సాహసం' సినిమా షూటింగ్ చేసేప్పుడు అక్కడి మూడు వేలమంది జవానులు నన్ను గుర్తుపట్టి మాతో ఫొటోలు తీయించుకోడానికి పోటీపడటం మరచిపోలేను. దానివల్ల షూటింగ్ కూడా కాసేపు ఆపేయాల్సి వచ్చింది.

    కోట బాబాయ్ భలే చెప్పాడు

    కోట బాబాయ్ భలే చెప్పాడు

    ఈ రోజుల్లో సినిమాలకు లాంగ్విటీ ఉండటం లేదు. ఓ సారి కోట శ్రీనివాసరావు బాబాయ్ అన్నారు. ‘ప్రస్తుత కాలంలో సినిమా మూడు వారాలు ఆడితే చాల్రా అబ్బాయ్' అని. అదేంటి? అంటే... ‘మూడు వారాలంటే... శుక్రవారం, శనివారం, ఆదివారం. సోమవారం కూడా నిలబడ్డోడు మగాడు' అన్నారు. ఆయన సరదాగా అన్నా అది నిజం. ‘అలీబాబా...' నిలబడతాడనుకుంటున్నా. ఈ సినిమాకైతే ఇప్పటివరకూ రెమ్యునరేషన్ తీసుకోలా. సోమవారం కూడా సినిమా నిలబడ్డాక నిర్మాతను కలుస్తా (నవ్వుతూ).

    ఇదే ప్రదేశంలో...

    ఇదే ప్రదేశంలో...

    1994లో ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే (అన్నపూర్ణ స్టూడియో) ‘యమలీల' ఓపెనింగ్ జరిగింది. ఆ ముహూర్తం వేళా విశేషమో ఏమో... యాభై సినిమాల్లో హీరోగా చేశాను. మళ్లీ అదే ప్రదేశంలో నా 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ' చిత్రీకరణ పూర్తయింది. సెంటిమెంట్ ప్రకారం తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం.

    ఎలక్షన్స్ లో...

    ఎలక్షన్స్ లో...

    1999 ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేశాను. ఒకవేళ ఇప్పుడు ఆ అవకాశం.. ఆలోచన వస్తే పోటీ చేస్తాను. డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో గెలవలేం. కానీ నేను మాత్రం ఎన్నికల కోసం నా డబ్బులు ఖర్చు పెట్టను. ఎవరైనా ఖర్చుపెడితే పోటీ చేస్తాను

    English summary
    Ali has acted in almost all Pawan Kalyan's movies so far. In fact, Pawan Kalyan makes sure that Ali has a significant role in all his movies. He has played a pretty important role in Pawan Kalyan's movies such as Kushi, Badri, Gabbar Singh, Teen Maar, Jalsa, Thammudu, Panjaa and many more.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X