»   » గతం కెలుక్కుంటున్న అలీ, కలిసొస్తుందా? పవన్,ఎన్టీఆర్ లతో సూపర్

గతం కెలుక్కుంటున్న అలీ, కలిసొస్తుందా? పవన్,ఎన్టీఆర్ లతో సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాయిగా తన పనేంటో తను చేసుకుంటూ,నవ్విస్తూ, నవ్వుతూ ఉండే అలీ..హఠాత్తుగా గతాన్ని కెలుక్కునే పోగ్రాం పెట్టుకునే పోగ్రాం పెట్టుకోవటం ఏమిటి అంటారా..అయితే నిజ జీవితంలో ఆ కార్యక్రమం ఆయన చేపట్టడం లేదు. ఓ సినిమా కోసం ఆయన పని చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి..ఆ కథా,కమామీషు చెప్పమంటారా..

వివరాల్లోకి వెళితే....క‌మెడియ‌న్ అలీ హీరోగా నాగు గ‌వ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకి 'సంజయ్ రామస్వామి' అనే టైటిల్ ను .. 'గతం కెలుక్కున్న గజిని' అనేది ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్క‌నున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 'గజిని' సినిమాలో సంజయ్ రామస్వామి పేరుతో సూర్య నటించిన సంగతి తెలిసిందే.

ఇక దివంగత శ్రీహరి కీలక పాత్రలో ఆదిత్, సుప్రియ జంటగా నటించిన వీకెండ్ లవ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగు గవర తన తదుపరి చిత్రంగా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆలీ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి సంజయ్ రామస్వామి అనే టైటిల్‌ను ఖరారు చేయటంతో క్రేజ్ వస్తుందనీ భావిస్తన్నారు.

గతం కెలుక్కున్న గజిని అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉందని వినిపిస్తోంది. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అలీ పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుందని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తానని దర్శకుడు నాగు గవర తెలిపారు.

ఇత అలి హీరోగా చేసి చాలా కాలం అయ్యింది. ఆ మధ్యన వచ్చిన అలీ బాబా..ఒక్కడే దొంగ చిత్రం డిజాస్టర్ కావటంతో మళ్లీ ఆయన హీరోగా ట్రై చేయలేదు. కానీ మరోసారి అలీ ధైర్యం చేసి సినిమా చేస్తున్నాడు. గజనీకు స్ఫూఫ్ లా ఉండి కామెడీ పండిస్తుందేమో చూడాలి. గజనీ చిత్రం వచ్చి చాలా కాలం కావటం జరిగింది. మరి ఏ ధైర్యంతో దర్శకుడు ఈ ప్రయత్నం చేయబోతున్నాడనేది రిలీజ్ అయితే కానీ తెలియదు. అలాగే అలీ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

స్లైడ్ షోలో అలీ హీరోగానే కాక బ్రేక్ ఇచ్చిన చిత్రాలు

యమలీల

యమలీల

1994లో అలీ హీరోగా వచ్చిన యమలీల చిత్రం ఎంత సంచలనం క్రియేట్ చేసిందో గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ సినిమా తో అలీ హీరోగా పూర్తి బిజీ అయ్యారు.

పిట్టల దొర

పిట్టల దొర

సానా యాదిరెడ్డి దర్సకత్వంలో వచ్చిన పిట్టల దొర చిత్రంలోనూ అలి హీరో గా చేసారు. ఆ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది.

ఘటోత్కచుడు

ఘటోత్కచుడు

తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన ఎస్ వి కృష్ణారెడ్డి దర్సకత్వంలోనే అలీ హీరోగా వచ్చిన చిత్రం ఘతోత్కచుడు

హలో బ్రదర్

హలో బ్రదర్

నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ చిత్రంలో త్రాగుబోతుగా తెగ నవ్వించాడు

తమ్ముడు

తమ్ముడు

పవన్ హీరోగా వచ్చిన తమ్ముడులో మళయాళి మనోహర్ గా డిఫరెంట్ పాత్ర పోషించాడు

ఖుషీ

ఖుషీ

2001లో పవన్ హీరోగా వచ్చిన ఖుషీ చిత్రంలో బాబు మోషాయ్ పాత్రలో జీవించాడు. ఆ పాత్రను మర్చిపోవటం కష్టం

ఇడియట్

ఇడియట్

రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ చిత్రంలో అలీ చేసిన రాంబాబు ట్రాక్ సూపర్ గా పేలింది.

వాసు

వాసు

వెంకటేష్ హీరోగా వచ్చిన వాసు చిత్రంలో గిటార్ ఆర్టిస్ట్ గా అలీ చేసిన పాత్రలు నంది అవార్డ్ సైతం వచ్చింది.

అమ్మా నాన్నా తమిళ అమ్మాయి

అమ్మా నాన్నా తమిళ అమ్మాయి

మళ్లీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో అలీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందరూ దొంగలే

అందరూ దొంగలే

రాజేంద్రప్రసాద్, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన అందరూ దొంగలే ..దొరికితే చిత్రంలో తాగుబోతు పాత్రకు అలీకు మంచి పేరు వచ్చింది.

నేనున్నాను

నేనున్నాను

2004లో నాగార్జున హీరోగా వచ్చిన నేనున్నాను చిత్రంలో అలీ పాత్ర అదిరింది.

అమ్మాయి బాగుంది

అమ్మాయి బాగుంది

శివాజి హీరోగా వచ్చిన అమ్మాయి బాగుంది చిత్రంలో అలీ కామెడీ ట్రాక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సూపర్

సూపర్

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంలో అలీ ఆర్టిస్ట్ గా కనపడతాడు. అతనికి బ్రహ్మానందం కు వచ్చే సీన్స్ హైలెట్ గా నడుస్తాయి

ఎవడిగోలవాడిది

ఎవడిగోలవాడిది

ఆర్యన్ రాజేష్ హీరోగా ఇవివి దర్సకత్వంలో వచ్చిన ఎవరి గోల వారిదే చిత్రంలో అలీ..సినిమా కథ చెప్పేవాడుగా సూపర్ గా చేసాడు

హంగామా

హంగామా

అలీ హీరోగా చాలా కాలం తర్వతా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన హంగామా చిత్రం ఇది. ఈ సినిమా మంచి విజయం సాధించింది

పోకిరి

పోకిరి

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి చిత్రంలో అలీ..చేసిన ముస్టివాడు పాత్ర సినిమా సక్సెస్ లలో ఒకటిగా నిలిచింది.

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా

రిషి హీరోగా వచ్చిన హిట్టైన ఈ చిత్రంలో యేసుదేసుగా చేసాడు. ఈ సినిమాకు అలీ పాత్రే కీలకం

టాటా బిర్లా మధ్యలో లైలా

టాటా బిర్లా మధ్యలో లైలా

శివాజి హీరోగా వచ్చిన ఈ చిత్రంలో అలీ పాత్ర లైలా..స్త్రీ పాత్రలో నవ్విస్తుంది.

దేశముదురు

దేశముదురు

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురులో హిమాలయ బాబాగా అలీ చించేసాడు

యమదొంగ

యమదొంగ

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగలో అలీ..ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా చేసి సినిమా మొత్తం నవ్విస్తాడు

చిరుత

చిరుత

రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత లో లచ్చిమి పాత్రలో అలీ చాలా కాలం గుర్తిండిపోయాడు

జల్సా

జల్సా

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా లో పవన్ కు ఫ్రెండ్ అబిగా కనిపిస్తాడు

కంత్రి

కంత్రి

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కంత్రిలో లీ..ఆస్ట్రాలజర్ గా కనిపించి నవ్వించాడు

కిక్

కిక్

రవితేజ హీరోగా వచ్చిన కిక్ లో డా.బలిగా కనిపించాడు అలి

మిరపకాయ

మిరపకాయ

రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయలో అల్ పచినో గా నవ్వించాడు

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

పవన్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ లో కానిస్టేబుల్ సాంబ గా నవ్వించాడు

సాహసం

సాహసం

గోపీచంద్ హీరోగా వచ్చిన సాహసం చిత్రంలో ఖయామత్ గా కనిపించి నవ్వించాడు

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో మేల్ నర్స్ గా నవ్విస్తాడు

బలుపు

బలుపు

రవితేజ హీరోగా వచ్చిన బలుపు చిత్రంలో అలీ ..డాక్టర్ సావిత్రిగా కనిపించి నవ్విస్తాడు

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తిలో పరంధామయ్యగా కనిపిస్తాడు అలీ

ఊపిరి

ఊపిరి

నాగార్జున హీరోగా వచ్చిన ఊపిరి చిత్రంలో లాయిర్ లింగం గా కనిపించి నవ్వించాడు

English summary
Nagu Gavara, who debuted as a director with Weekend Love is set to make his second film. He has finalized the project and comedian Ali will be the lead in this film.Titled as Sanjay Ramaswamy, this flick comes with the tag line 'Gatham kelukkunna Ghajini' ('Ghajini revisits his past').
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu