»   » నవ్విస్తుంది: అలీ-యాంకర్ సుమ ‘బాహుబలి’ స్పూఫ్ (వీడియో)

నవ్విస్తుంది: అలీ-యాంకర్ సుమ ‘బాహుబలి’ స్పూఫ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండే..... వాటిని అనుసరిస్తూ స్పూఫ్ వీడియోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా విడుదలైన తర్వాత కూడా పలు స్పూఫ్ వీడియోలు వచ్చాయి.

Ali, Suma Funny Spoof - Baahubali CineMAA Awards 2015

తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ, యాంకర్ సుమ కలిసి చేసిన బాహుబలి స్పూఫ్ తెగ నవ్విస్తోంది. సినీ‘మా' అవార్డుల ఫంక్షన్ సందర్భంగా ఈ స్పూఫ్ వీడియోను ప్రదర్శించారు. దీన్ని చూసి సినీ‘మా' అవార్డుల కార్యక్రమానికి హాజరైన స్టార్స్ అంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో తాజాగా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

బాహుబలి సినిమాలో శివుడు.... అవంతిక కోసం కొండ ఎక్కే సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ధీవర సాంగ్ నేపథ్యంలో ఈ స్పూఫ్ వీడియో డిజైన్ చేసారు. అలీ... శివుడి తరహాలో కష్టపడి జలపాతం ఎక్కడం, ఒక కొండ అంచు నుండి మరో కొండ పైకి దూకడం, తర్వాత బాణం ఉపయోగించి తాడు సహాయంతో అవంతికను చేరుకోవడం లాంటివి స్పూఫ్ లో కామెడీ పుట్టించే విధంగా చిత్రీకరిచారు.

ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. అలీ, యాంకర్ సుమ టైమింగ్ అదిరిపోయే విధంగా ఉంది. ‘బాహు-అలీ' పేరుతో ఉన్న ఈ కామెడీ స్పూఫ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
This time Ali has targeted super hit movie, India's pride 'Baahubali' as he teamed up with anchor Suma again to come up with a spoof. From Sivudu to Baahubali Ali posed in the role quite well, as his entry is that of carrying a bronze water-tin instead of a Siva Lingam like Sivudu. Then there is this Deevaara song filmed on Ali and Suma and they mimicked Prabhas and Tamanna perfectly.
Please Wait while comments are loading...