»   » ‘అలియాస్ జానకి’ సెన్సర్ రిపోర్ట్, మెగా సపోర్ట్

‘అలియాస్ జానకి’ సెన్సర్ రిపోర్ట్, మెగా సపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అలియాస్ జానకి చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను మంది హీరోగా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనమామ కొడుకు అయిన వెంకట్ రాహుల్ 'అలియాస్ జానకి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు.

తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని జులై 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'అలియాస్ జానకి'. సంఘమిత్ర ఆర్ట్స్ నిర్మిస్తోంది. తారా అరుళ్‌రాజ్ సమర్పకుడు. నీలిమ తిరుమలశెట్టి నిర్మాత. దయా.కె. దర్శకుడు.

మెగా రిలేషన్ ఉండటంతో ఈచిత్రానికి అభిమానుల నుంచి మెగా సపోర్ట్ లభిస్తోంది. ఇటీవల చిరంజీవి తల్లి అంజనాదేవితో ఆ చిత్రం ఆడియో సీడీలు విడుదల చేయించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ...'రాహుల్ మా మేనమామ కొడుకే. ఈ చిత్రం కథను తనే తయారు చేసుకున్నాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాడు. ఇందులో అతనికి తండ్రిగా నటించాను' అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాతోనే చిన్న సినిమాలు చేస్తున్నానని నిర్మాత నీలిమ తిరుమలశెట్టి అంటున్నారు.

నాగబాబు, తనికెళ్ల భరణి, శివ నారాయణ, భరణి శంకర్, శత్రు, వంశీ రెడ్డి, రమేష్ వేంపల్లి, మీనా కుమారి తదితరులు ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్: హరి వర్మ, నృత్యాలు: దయా.కె, వంశీ కాట్రోజు, యాక్షన్: దయా.కె., సుజిత్ సారంగ్, మాటలు: వంశీ కృష్ణ గద్వాల, వశిష్ట శర్మ, అర్జున్, సుమన్ చిక్కల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దయా.కె., సహ నిర్మాత: విక్రమ్.ఎస్.

English summary
Alias Janaki movie has been awarded a U/A by the censor board. Venkat Rahul, who is related to Megastar Chiranjeevi, and Anisha Ambrose have played the lead roles in the movie. Dayaa is the director and Neelima Tirumalasetty is the producer of this movie.
Please Wait while comments are loading...