»   » పవన్ రాలేదు, కటౌట్ వచ్చింది...(అలీ వినూత్న ప్రయత్నం)

పవన్ రాలేదు, కటౌట్ వచ్చింది...(అలీ వినూత్న ప్రయత్నం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గబ్బర్ సింగ్ సినిమాలో ఓ సన్నివేశంలో బ్రహ్మానందం విలన్ల ఇంటికి వెళ్లడం, నా వెనక 'గబ్బర్ సింగ్' ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ కటౌట్ రిక్షాపై పెట్టుకుని రావడం, విలన్లకు ఝలక్ ఇవ్వడం తెలిసిందే. తాజాగా 'అలీ బాబా ఒక్కడే దొంగ' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కూడా ఇలానే జరిగింది.

ఈ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ రాలేదు...కానీ ఆయన కటౌట్ వచ్చింది. అలీ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలే ఈ ఫంక్షన్లో మెయిన్ అట్రాక్షన్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే......ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సందర్భంగా ప్రధానం చేసిన షీల్డులపై కూడా పవన్ కళ్యాణ్‌తో కలిసి అలీ దిగి ఫోటోలనే ప్రధానంగా ముద్రించడం. ఆయన రాక పోయినా ....ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను వీయోడ్ బైట్ ద్వారా ప్రదర్శించారు.

పవన్ కళ్యాన్‌కు, ఈ సినిమాకు సంబంధం లేక పోయినా వినూత్న ప్రయత్నం చేయడం వెనక కారణం ఏమిటో......ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ద్వారా ఈ సినిమాకు హైప్ తేవడమే లక్ష్యంగా చిత్రం హీరో అలీతో పాటు దర్శక నిర్మాతలు ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

స్లైడ్ షోలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వివరాలు....

అలీ బాబా ఒక్కడే దొంగ

అలీ బాబా ఒక్కడే దొంగ


అలీ, సుజావారుణి హీరో హీరోయిన్లుగా ఫణిప్రకాష్ దర్శకత్వంలో కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై బొడ్డేడ శివాజీ నిర్మిస్తున్న చిత్రం ‘అలీ బాబా ఒక్కడే దొంగ'.

హీరోగా అలీకి 50వ చిత్రం

హీరోగా అలీకి 50వ చిత్రం


ఒకప్పుడు అలీ హీరోగా వరుస కామెడీ చిత్రాలు వచ్చాయి. అయితే అలీ గత కొంత కాలంగా హీరో పాత్రలకు దూరంగానే ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న ఈ చిత్రం హీరోగా అలీకి 50వ సినిమా కావడం గమనార్హం.

ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్

ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్


ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఆడియో హిట్టయిన నేపథ్యంలో ఈ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.

ముఖ్య అతిథులు

ముఖ్య అతిథులు


‘అలీ బాబా ఒక్కడే దొంగ' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ప్రముఖ దర్శకులు వివి వినాయక్, పూరి జగన్నాథ్, అల్లరి నరేష్, గిరిబాబు, తనికెళ్ల భరణి శోభారాణి తదితరులు హాజరయ్యారు.

థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ

థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ


ఈ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. దర్శకుడు వివి వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించగా, టీవీ ప్రమోషన్ ట్రైలర్ అల్లరి నరేష్, తనికెళ్ల భరణి విడుదల చేసారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..(వీడియో బైట్ ద్వారా)

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..(వీడియో బైట్ ద్వారా)


అలీ హీరోగా చేస్తున్న 50వ సినిమా ఇది. దర్శకుడు, నిర్మాతలకు నా అభినందనలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అలీ మాట్లాడుతూ...

అలీ మాట్లాడుతూ...


హీరోగా నాకు ఇది 50వ సినిమా. అలీ బాబా అరడజను దొంగల్లో నేను ఒకడిగా చేసాను. ఇపుడు అలీ బాబా ఒక్కడే దొంగలో హీరోగా చేసాను. అలీ అనే మొక్కను నాటింది ఇవివి గారైతే, నీళ్లు పోసింది మాత్రం ఎస్వీకృష్ణారెడ్డిగారే. తర్వాత రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు నాకు మంచి పాత్రలు ఇచ్చి బాగా ప్రోత్సహించారు. నా ఎదుగుదలకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.

వివి వినాయక్, పూరి జగన్నాథ్ అభినందనలు

వివి వినాయక్, పూరి జగన్నాథ్ అభినందనలు


ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, వివి వినాయక్ తదితరులు మాట్లాడుతూ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

English summary
Alibaba Okkade Donga Platinum Disc function held at Hyderabad. Telugu Comedian Ali playing as Hero in Alibaba Okkade Donga Movie. Phani Prakash directing Alibaba Okkade Donga movie with Ali and Boddada Sivaji producing under Kamal Cine Creations banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu