twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టాలి

    By Srikanya
    |

    చెన్నై : తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే పెట్టాలని నిర్మాత కె.మురారి పిలుపునిచ్చారు. తెలుగుభాషలో నిర్మితమవుతున్న స్ట్రెరుుట్ చిత్రాలకు తెలుగులోనే పేరుపెట్టేలా సినీ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవాలని సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి సూచించారు.ఈనెల 27 నుంచి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ కలిగిన, ప్రభావ వంతమైన మీడియాగా సినీ నిర్మాతలు తమ వంతు బాధ్యత గుర్తెరగాలన్నారు.

    "భాషావ్యాప్తికి సినిమాలు కూడా ఒక సాధనమే. తమిళనాడులో తమిళ సినిమాలకు తమిళంలోనే పేరు పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది. అందువల్లే, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ నటించిన చిత్రానికి రోబో అని కాకుండా యంతిరన్ అనే పేరు పెట్టారు.రాష్ట్ర ప్రభుత్వం సైతం 50 శాతం పన్ను మినహాయించి అటువంటి చిత్రాలను ఆయన ప్రోత్సహించాలని కోరారు. తమిళనాడులో తమ చిత్రాలకు తమిళంలోనే పేరుపెడితే ప్రభుత్వం 50 శాతం పన్ను మినహాయింపు ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. చెన్నైలో జరిగిన మీడియూ సమావేశంలో మురారి పై విధంగా స్పందించారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ - మన మాతృభాష ఉనికి కోల్పోకముందే మనందరం మేల్కొనాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. తెలుగుభాషకు పూర్తిగా తెగులు సోకక ముందే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రముఖ సినీ విశ్లేషకులు వీఏకె.రంగారావు కూడా పాల్గొన్నారు.'' అని తెలిపారు.సినిమాలకు కచ్చితంగా తెలుగు పేరే పెట్టాలనడంకంటే... తెలుగు పేర్లు పెట్టిన వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మేలని అభిప్రాయపడ్డారు.

    ఎనిమిది సినిమాలు తీసి.. అందులో ఆరు హిట్లు కొట్టిన విజయవంతమైన నిర్మాత ఆయన. ఆ విజయంలో ఉండగానే సినిమాలు ఆపేశారు. ఇన్నాళ్లకు మళ్లీ 'నవ్విపోదురుగాక' అంటూ జనం ముందుకొచ్చారు. అలాంటి నిర్మొహమాట నిర్మాత కాట్రగడ్డ మురారి.మురారి సినిమాల్లో సీతామహాలక్ష్మి, గోరింటాకు, జానికిరాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.

    English summary
    
 Like in Tamil Nadu, a proposal to ensure all Telugu films have their titles in Telugu.'Yuva Chitra' banner Murari says that telugu films will be with Telugu Titles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X