»   » టైటిలే ఫన్నీ గా ఉంది "మేడమీద అబ్బాయి" ఎలా ఉంటాడో

టైటిలే ఫన్నీ గా ఉంది "మేడమీద అబ్బాయి" ఎలా ఉంటాడో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదట్లో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు అల్లరి నరేష్. ఒక ప్పుడు ఒకె సంవత్సరం లో రెండు.., మూడు సినిమాలు కూడా వచ్చేవి. అంటే కాదు అల్లరి నరేష్ సినిమా అంటే ఫ్లాప్ అవాల్సింది కూదా యావరేజ్ అనిపించుకుఏది. కానీ రానూ..రానూ.. మూస కామెడీకి కాస్త ఆధరణ తగ్గింది. నరేష్ కి కూడా ఒకే రకం పాత్రలతో మొహం మొత్తిందో లేదంటే నిజంగానే అవకాశాలు రాలేదేమో కానీ

ఈ మధ్య మరీ సైలెంట్ అయిపోయాడు. అయితే ఇలా కుదరదనుకున్నాడేమో ఇప్పుడు మళ్లీ తన స్పీడు పెంచుతున్నట్టు అనిపిస్తోంది. త్వరలో 'సెల్ఫీ రాజా'గా రానున్న ఆయన, జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . 'అలా ఎలా' తర్వాత ఏడాదిన్నరపైగా విరామం తీసుకుని అల్లరి నరేష్ తో సినిమా చేస్తున్నాడు అనీష్.ఈ చిత్రానికి 'మేడ మీద అబ్బాయి' అనే పేరు రిజిస్టర్ చేయించారు.

Allari Naresh as Meda meeda Abbayi!

సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు మాటలు కూడా రాస్తుండటం విశేషం. అనీష్ తొలి సినిమాలోనూ కృష్ణభగవాన్ చిన్న పాత్ర చేయడంతో పాటు రచనా సహకారం అందించాడు. కృష్ణభగవాన్ గతంలో వంశీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు మాటలు రాశాడు. అల్లరినరేష్-అనీష్ కాంబినేషన్లో రాబోయే సినిమాను జాహ్నవి ప్రొడక్షన్స్ అనే కొత్త సంస్థ నిర్మించబోతోంది. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఈ ఏడాది ఆఖర్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

English summary
Allari Naresh will be acting in two comedy films back to back. After Selfie Raja Naresh will be acting under G. Nageshwara Reddy direction titled “Intlo Dayyam Nakem Bhayyam”. After this he is going to act in a movie which has senior comedian Krishna Bhagavan’s story titled as “Meda Meeda Abbayi”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu