»   » పుట్టిన రోజు పూటే చచ్చిపోయాను...అల్లరి నరేష్

పుట్టిన రోజు పూటే చచ్చిపోయాను...అల్లరి నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పుట్టిన రోజుని ప్రత్యేకంగా వేడుక చేసుకోవడం నాకు అలవాటు లేదు. మామూలుగా గడిచిపోయే మరో రోజు...అంతే. కాకపోతే ఓ సంఘటన నాకు బాగా గుర్తొస్తోంది. 'గమ్యం'లో నేను చనిపోయే సన్నివేశం ఉంది. అది సరిగ్గా నా పుట్టిన రోజే తీశారు.అయితే దాన్ని ఎందుకు ఒప్పుకున్నాను అంటే...ఆ రోజు కాకపోయినా ఆ సినిమాలో ఏదో ఒక రోజు నేనే చావాలి కదండీ. మరో మాట 'షోలే'లో అమితాబచ్చన్‌ చనిపోయే సన్నివేశం కూడా సరిగ్గా ఆయన పుట్టిన రోజునాడే తీశారు. దాన్నే స్ఫూర్తిగా తీసుకున్నాను అనుకోండి అన్నారు అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నటించిన శుభప్రదం చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే వంశీ దర్శకత్వంలో సరదాగా కాసేపు చిత్రంలో చేస్తున్నారు. ఇక ఈ యంగ్ కామిడీ హీరో పుట్టిన రోజు ఈ రోజే. ఈ సందర్భంగా ధట్స్ తెలుగు...ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని విషెష్ తెలియచేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu