»   » అల్లరి నరేష్ చిత్రం సెన్సార్ కట్స్ అన్నీ బూతుమయమే..

అల్లరి నరేష్ చిత్రం సెన్సార్ కట్స్ అన్నీ బూతుమయమే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్‌, కామ్నా జెఠ్మలానీ, కోటశ్రీనివాసరావు ముఖ్యపాత్రలు పోషించిన 'కత్తి కాంతారావు' చిత్రం క్రిందట నెలలో విడుదల అయింది.. బిగ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇవివి సత్యనారాయణ దర్సకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కట్స్ చూస్తుంటే ఇన్ని బూతులు ఈ సినిమాలో పెడదామని ప్రయత్నించారా అనే డౌట్ రాక మానదు. అవేమిటో చూద్దాం.

1. సినిమాలో 'నీయమ్మ', 'దానమ్మ' పదాలు ఎక్కడ వచ్చినా వాటిని తొలగించమని వేరే ప్రత్యామ్నాయ పదా లుపయోగించమని చెప్పారు.
2. ఒకటి రెండు రీళ్లలో చిత్రీకరించిన 'పది నిముషాల్లో దాన్ని పడగొట్టి పొద చాటుకి తీసుకెళ్ళి అక్కడ చేయగలవన్నీ చేసేస్తా బెట్టా' అనేది తొలగించడమొ ప్రత్యామ్నాయంగా వేరే డైలాగ్‌ ఉంచమనో సూచిస్తే, "పది నిముషాల్లో దాన్ని లైనులో పెట్టి పక్కకి తీసుకెళ్లి టిఫెన్లన్నీ చేస్తా బెట్టా" అనే వాక్యం ఉంచడానికి అంగీకరించారు.
3. ఒకటి రెండు రీళ్లలో చిత్రీకరించిన మొదటి పాటలో హీరో ఎత్తినపుడు హీరోయిన్‌ తొడలు ఎక్స్‌పోజ్‌ అయ్యే దృశ్యాన్ని తొలగించారు.
4. మూడు నాలుగు రీళ్ళలోని 'ఆడు కుర్ర లాఠీ...ఆడేం సుఖ పెడతాడు...పెద్ద క్యాప్‌ నన్ను నమ్ముకో స్వర్గం చూపిస్తా' అన్న డైలాగ్‌ని తొలగించడమో లేదా వేరే వాక్యం ఉంచమనో సూచించగా "కుర్ర కుంక ఆడేం సుఖపెడతాడు పెద్ద సార్ని నన్ను నమ్ముకో స్వర్గం చూపిస్తా" అనే డైలాగ్‌ వుంచడానికి అంగీకరించారు.
5. మూడు నాలుగు రీళ్ళలో 'పట్టుమని పదిరోజులు కూడా డబుల్‌ కాట్‌ ఎక్కింది లేదు' అంటూ హీరో తోబుట్టువులు పలికే డైలాగ్ ‌ని తొలగించి "పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేసింది లేదు" అనే వాక్యం ఉంచడానికి ఒప్పుకున్నారు.
6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'పట్టుకునే వున్నానండీ' అని లేడీతో హీరో అన్నమాటలు తొలగించారు.
7. మూడు నాలుగు రీళ్ళలో 'గంగాభవానీ, నన్నపనేని రాజకుమారి' పదాలను తొలగించి వాటికి బదులుగా "మంగా భవానియో సన్నపనేని రాజకుమారియా కాదుగా" అనే వాక్యం ఉంచడానికి ఒప్పుకున్నారు.
8. లంక సతీష్‌ తాగే దృశ్యాన్ని తొలగించడమో లేదా అందుకు సంబంధించిన హెచ్చరిక పెట్టడమో చేయమని సూచించారు.
9. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'నీకంటె బీహార్‌ వాళ్ళే బెటర్‌' అనే వాక్యం తొలగించి, దానికి ప్రత్యామ్నాయంగా 'మీ కంటె బందిపోట్లే బెటర్‌ కదరా' అనేది ఉంచడానికి అంగీకరించారు.
10. అయిదు ఆరు రీళ్ళలోని 'కానిస్టేబుల్‌ అయినంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు వ్యభిచారం చెయ్యచ్చా' అనే డైలాగ్‌ స్థానే "ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సరసాలు ఆడేయొచ్చు అనుకుంటున్నావా" అనే వాక్యం పెట్టడాన్ని ఓ.కే. చేసారు.
11. తొమ్మిది పదిరీళ్ళలో 'ఏం పీకుదామని ఇంతమందిని కన్నావు' అని హీరో తన తండ్రిని అడగడాన్ని తొలగించి "ఏం చేద్దామని ఇంతమందిని కన్నావు" అనే వాక్యం ఉంచడానికి అంగీకరించారు.
12. తొమ్మిది పదిరీళ్ళలో హీరోయిన్‌ గురించి వృద్ధురాలు 'గోకిందా' అని అనడం తొలగించమని లేదా దానికి బదులు అంగీకారయోగ్యమైన పదం ఉంచమని సూచించారు.
13. అయిదు ఆరు రీళ్ళలో హీరో హీరోయిన్‌లను కోట శ్రీనివాసరావు తీసుకు వచ్చినపుడు వాడిన 'బ్రోకర్‌' పదం తొలగించి దానికి బదులు 'హెల్పర్‌' అని ఉంచడానికి ఒప్పుకున్నారు.
14. పదకొండు పన్నెండు రీళ్ళలో 'అందరూ వచ్చి నా వంకాయ మీద గుద్దాలి' అనే వాక్యంలోని 'వంకాయ' తొలగించమంటే దానికి ప్రత్యామ్నాయంగా 'మీరంతా వంకాయ మీద గుద్దాలి' అనే వాక్యం ఉంచారు.
15. పది, పదకొండు, పన్నెండు రీళ్లలో వచ్చిన నాలుగో పాటలోని 'పొడుస్తాడు'. అయిదవ పాటలోని 'సరుకుందా కులుకుందా, మీదపడుకున్నావు' పదాలు తొలగించి ప్రత్యామ్నాయ పదాలు పెట్టమని సూచించారు.
16. పదమూడు పద్నాలుగు రీళ్ళలోని 'అండర్‌ గ్రౌండ్లో సుడివుంది' డైలాగ్‌కి బదులు "అరి కాలులో సుడివుంది" అని ఉంచడానికి ఒప్పుకున్నారు.

'కత్తి కాంతారావు' చిత్రాన్ని చూసిన ఇసి 16 కట్స్‌ తో 7-12-10న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీచేసింది. ఈ చిత్రం 10-12-10న విడుదలయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu