»   »  మహేష్ బాబు కొత్త మూవీ లోగో...కాపీ అంటూ ప్రచారం!

మహేష్ బాబు కొత్త మూవీ లోగో...కాపీ అంటూ ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి '1' అనే టైటిల్ ఖరారు చేయగా, 'నేనొక్కడినే' అనేది ఉపశీర్షిక. అయితే ఈ టైటిల్ లోగోపై ఇప్పుడు ఓ ప్రచారం మొదలైంది. టైటిల్ లోగో కొత్తగా లేదని, దాన్ని ఇతర కొన్ని లోగోల నుంచి కాపీ కాస్త మార్చి రూపొందించారనే వాదన వినిపిస్తోంది.

ఈ లోగో సూర్య 'సింగం 2', ఐఫీఎల్ ప్రాంచైజీ సన్ రైజర్స్, జీవా హీరోగా వచ్చిన 'ఈ' మూవీ లోగోలను పోలి ఉందని అంటున్నారు. అయినా లోగోలో ఏముందిలే...సినిమా ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వాలి. అయితే అభిమానులు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. లోగో చాలా బాగుందని, మా హీరో నెం.1 ఇమేజ్ ప్రతిభింభించేలా లోగో ఉందని అంటున్నారు. ఇప్పటికే పలువురు మహేష్ బాబు అభిమానులు ఆ లోగోలను తమ బైక్‌పై వేయించుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కాగా, ఫస్ట్ లుక్‌పై మహేష్ బాబు స్పందిస్తూ...' మా చిత్రం '1' ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమా టీం మొత్తం మీ అంచనాలను అందుకోవడానికి చాలా కష్ట పడి పని చేస్తున్నారు. నా కెరీర్లో ఈచిత్రం మరో ల్యాండ్ మార్క్ అవుతుంది' అని ట్వీట్ చేసారు.

మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 Mahesh Babu's upcoming film '1-Nenokkadine' first look was released. Many felt the logo is the copy of other upoming films. Those who viewed the logo felt that the there was nothing new in the design and lacks creativity. To the top of it, the logo was copied from Surya's Singam-2 first look, IPL franchisee Sunrisers Hyderabad logo and even Tamil hero Jeeva's 'Ee' title logo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu