»   » ‘ఖైదీ నంబర్‌ 150’ తో భయం పడుతున్న అల్లు అరవింద్,కారణం ఇదీ

‘ఖైదీ నంబర్‌ 150’ తో భయం పడుతున్న అల్లు అరవింద్,కారణం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''ఇప్పుడు ఖైదీ నంబర్ 150కి వస్తున్న స్పందన చూస్తుంటే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భయం వేస్తోంది. ఆరు నెలలు ఆగి అయినా సరే.. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాం. ఈలోగా రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి సినిమా మరొకటి నిర్మాణం పూర్తి చేసుకుంటుంది'' అంటూ స్పందించారు అల్లు అరవింద్.

చిరంజీవి హీరోగా నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తొలిరోజు చిత్ర కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. తెలుగు సినిమాల్లో తొలిరోజు అత్యధికంగా గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా 'ఖైదీ నంబర్‌ 150' నిలిచిందని ఆయన తెలిపారు.

Allu Aravind about Khaidi No 150 responce

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.47.7కోట్లు వసూలు చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.30.04కోట్లు, కర్ణాటకలో రూ.4.72కోట్లు, ఓవర్సీస్‌(అమెరికా) 1.22 మిలియన్‌ డాలర్లు, మిగిలిన దేశాల్లో సుమారు రూ. 2.12కోట్లు వసూలు చేసిందని వివరించారు.

ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి నిర్మాత రామ్‌చరణ్‌ ఒకరోజు ముందే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారన్నారు. గతంలోలా కాకుండా రెండు, మూడు వారాల్లో కలెక్షన్లు పూర్తవుతున్నాయన్నారు. తనకు తెలిసి సుమారు 2వేల తెరలపై చిత్రాన్ని ప్రదర్శించారని తెలిపారు. చిరంజీవిపై జనంలో అభిమానం తగ్గలేదని, 'ఖైదీ నంబర్‌ 150' విడుదల సందర్భంగా మస్కట్‌లో బుధవారం చాలా కంపెనీలు సెలవు కూడా ఇచ్చాయని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు.

" నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే రోజు వస్తుంది" అంటూ చిరంజీవి తన రియల్ లైఫ్ టచ్ డైలాగ్స్ తో...వెండితెరపైకి దూసుకువచ్చేసారు. దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత చిరంజీవి తిరిగి మేకప్ వేసుకుని మెగాస్టార్ గా మరోసారి విశ్వరూపం చూపించేయటానికి విచ్చేసారు. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ తన అభిమానులకు ఆనందం కలిగించేలా సామాజిక సందేశంతో కూడిన మాస్ మసాలా కథని తీసుకుని కుమ్ముడు అంటూ రిలీజ్ కు ముందే ట్రైలర్స్,సాంగ్స్ తో కుమ్మేసి హైప్ క్రియేట్ చేసేసారు.

తమిళ చిత్రం 'కత్తి'కి రీమేక్‌గా మన ముందుకొచ్చినా...రామ్‌చరణ్‌ నిర్మాతగా అందిస్తోన్న తొలి సినిమా కావటం, వినాయిక్, చిరు కాంబో రిపీట్ చేయటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. చాలా కాలం తర్వాత వస్తున్న తమ అన్నయ్య చిరు చిత్రం కావటం మెగాభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు అయ్యింది.

కానీ అదే సమయంలో ఎంతో ఘనంగా సాగుతున్న చిరు రీ ఎంట్రీకి... రీమేకే ని ఎంచుకోవాలా అనే విమర్శలూ అంతటా వినపడ్డాయి. హీరో చిరంజీవి,దర్శకుడు వినాయిక్ తనదైన శైలిలో వాటిని తిప్పి కొట్టారు. అయితే నిజంగానే ఆయన రీమేక్ సినిమాతో రావటం... రీ ఎంట్రీకి ఫెరఫెక్ట్ ఏప్ట్ అంటున్నారు రిజల్ట్ చూసినవాళ్లు.

English summary
Megastar Chiranjeevi, Khaidi No 150 released and became super hit. Directed by VV Vinayak, produced by Ram Charan under the banner of Konidela Production Company and features Kajal Aggarwal in the lead role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu